ఉగ్రవాదంపై ఉక్కుపాదం.. భారత్‌కు మలేషియా సంపూర్ణ మద్దతు..
భారత్ ఉగ్రవాదం పట్ల ఏమాత్రం సహనం చూపబోదని, ఉగ్రవాదులకు, వారికి మద్దతిచ్చే దేశాలకు మధ్య ఇకపై ఎలాంటి తేడా చూపబోదని జేడీ(యూ) ఎంపీ సంజయ్ కుమార్ ఝా నేతృత్వంలోని అఖిలపక్ష పార్లమెంటరీ ప్రతినిధి బృందం సోమవారం మలేషియాలో స్పష్టం చేసింది. ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన దారుణమైన ఉగ్రదాడి గురించి, అనంతరం భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ గురించి ఈ బృందం మలేషియాలోని ప్రముఖ మేధోమథన సంస్థలకు, విద్యావేత్తలకు వివరించింది. భారత్ చేపట్టిన ఈ చర్య కచ్చితమైనదని,…

