కాళేశ్వరంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు: కాంగ్రెస్ కుట్ర వల్లే ప్రాజెక్టుకు నష్టం?
సిరిసిల్ల పర్యటనలో ఉన్న కేటీఆర్, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రేవంత్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ నాయకులు అధికారంలోకి రావడం కోసం ఈ ప్రాజెక్టుపై కుట్రలు చేశారని ఆయన ఆరోపించారు. ఇసుక మాఫియా కోసం అడ్డుగా ఉన్న చెక్ డ్యాంలను బాంబులు పెట్టి కూల్చేస్తున్నారని మండిపడ్డారు. మానవ నిర్మిత అద్భుత కట్టడాలపై కాంగ్రెస్ ప్రభుత్వం మానవ విధ్వంసానికి పాల్పడుతోందని ధ్వజమెత్తారు. ప్రజల సొమ్ముతో నిర్మించిన ఆస్తులను నాశనం చేస్తుంటే తాము చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. బీఆర్ఎస్…

