వివేకానంద కేసులో కొత్త మలుపు, ఎంపీ అవినాష్ ఇళ్లు సహా పలు చోట్ల ఈడీ సోదాలు..
ముఖ్యంగా హైదరాబాద్, కడపతోపాటు మరో నాలుగు చోట్ల సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కోకాపేట్‌లోని ఓపెన్ స్కైస్‌లోని ఎంపీ అవినాష్‌రెడ్డి నివాసం, అలాగే పులివెందుల ఇళ్లలోనూ సోదాలు జరుగుతున్నాయి. ఆ ఇంటికి తాళం వేసి ఉండడంతో బయట ఉన్నారు ఈడీ అధికారులు. ఎంపీ ఇళ్లతోపాటు నిందితులు సునీల్ యాదవ్, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఇళ్లలో ఈ సోదాలు జరుగుతున్నాయి. సీబీఐ కేసు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది ఈడీ. ఈ కేసులో రాజకీయ నేతల ప్రమేయం,…

