బెంగాల్ ఆందోళనలు హింసాత్మకం, ముగ్గురు మృతి, కేంద్ర బలగాల ఎంట్రీ..!
వక్ఫ్ సవరణ చట్టాని(Waqf Act)కి వ్యతిరేకంగా పశ్చిమబెంగాల్‌లో కొనసాగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ముర్షిదాబాద్, మాల్దా, సౌత్ 24 పరగణాలు, హుగ్లీ జిల్లాల్లో నిరసనకారులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగి రోడ్లను నిర్బంధించారు. కొందరు ఆందోళనకారులు హిందువుల నివాసాలు, వాహనాలు లక్ష్యంగా దాడులకు పాల్పడ్డారు. షాపులు, దుకాణాల్లో దూరిన కొందరు దొంగతనాలకు తెగబడ్డారు. ఈ నిరసనలు ఉద్రిక్తతలకు దారితీయడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు పోలీసులు ధృవీకరించారు. ఘర్షణల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. కాల్పుల్లో…

