News

TELANGANA

అనాథ యువతికి పెళ్లి చేసిన కలెక్టర్..! అధికారులే ఆత్మబంధువులు

సర్కారు బాలసదన్‌లో ఆశ్రయం పొంది పెళ్లీడుకు వచ్చిన ఓ అనాథ యువతికి.. ప్రభుత్వ అధికారులే దగ్గరుండి కరీంనగర్‌ కళాభారతిలో పెళ్లి జరిపించారు. అమ్మనాన్నల బాధ్యత తీసుకుని పుస్తెలు, మెట్టెలు సహా అనేక కానుకలు అందించారు. కలెక్టర్ పమేలా సత్పతి, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ.ఇతర ప్రభుత్వ అధికారులు హాజరై నవదంపతులను ఆశీర్వదించారు. భవిష్యత్తులో ఈ దంపతులకు సర్కారే అండగా ఉంటుందని.. తల్లిదండ్రుల పాత్రను తామే తీసుకుంటామన్నారు అధికారులు.   పూజ అలియాస్ మౌనిక.. చిన్నతనంలో ఉండగానే తల్లిదండ్రులిద్దరూ…

TELANGANA

ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ కు జై కొట్టేందుకు జనం సిద్ధంగా ఉన్నారు: కేసీఆర్..

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు ఎర్రవెల్లి ఫాంహౌస్ లో పార్టీ నేతలతో సమావేశమయ్యారు. వారికి భవిష్యత్ దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ప్రజలు ఇవాళ కష్టాల్లో ఉన్నారని, కాంగ్రెస్ హామీలు నమ్మి మోసపోయి గోసపడుతున్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిజస్వరూపం ఏంటో ప్రజలకు అర్థమైందని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ కు జై కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని కేసీఆర్ స్పష్టం చేశారు.   బీఆర్ఎస్… తెలంగాణ ప్రజలు నిర్మించుకున్న రాజకీయ అస్తిత్వ పార్టీ అని స్పష్టం చేశారు. నేడు…

SPORTS

రేపే చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌… భారత్ vs న్యూజిలాండ్..

చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య రేపు దుబాయ్‌లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, మ్యాచ్ జరిగే పిచ్‌ ఎలా ఉండబోతోందన్న దానిపై రెండుమూడు రోజులుగా పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా, దీనిపై ఒక స్పష్టత వచ్చేసింది. ‘బ్రాండ్ న్యూ’ పిచ్‌పై కాకుండా ‘సెమీ-ప్రెష్’ పిచ్‌ను సిద్ధం చేసినట్టు తెలిసింది.   రెండువారాల క్రితం అంటే ఫిబ్రవరి 23న ఈ పిచ్‌ను గ్రూప్ స్టేజ్‌లో…

TELANGANA

ఆర్టీసీలో మహిళా సంఘాల అద్దె బస్సులు… నేడు ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి..

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నేడు (మార్చి 8) సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో భారీ ఎత్తున కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో పలు పథకాలను ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో తీసుకువచ్చిన ఇందిరా మహిళా శక్తి మిషన్ ను ఆవిష్కరించనున్నారు.   డ్వాక్రా సంఘాల సోలార్ విద్యుత్ ప్రాజెక్టులకు వర్చువల్ గా శంకుస్థాపన చేయనున్నారు. తద్వారా 32 జిల్లాల్లో 64…

AP

బెయిలుపై బయటకు వచ్చి.. అజ్ఞాతంలోకి వెళ్లిన రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్..

తల్లి అనారోగ్యంతో బాధపడుతోందంటూ తప్పుడు మెడికల్ సర్టిఫికెట్‌తో మధ్యంతర బెయిలు పొందిన రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. దీంతో అతడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. గుంటూరు రాజేంద్రనగర్‌, వేళాంగిణి నగర్‌లో ఆయన ఇళ్లకు వెళ్లి చూడగా తాళాలు దర్శనమిచ్చాయి. ఆయన కుటుంబ సభ్యులు కూడా అందుబాటులో లేకపోవడం, ఫోన్లు స్విచ్చాఫ్ వస్తుండటంతో వారి ఆచూకీ కోసం పోలీసు గాలిస్తున్నారు.   తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, జనసేనాని పవన్ కల్యాణ్, వారి…

AP

వివేకా కేసులో అసలేం జరుగుతుంది..? రంగన్న డెడ్ బాడీకి రీ పోస్టుమార్టం…

వైఎస్ వివేకానంద హత్య కేసులో సాక్షి రంగన్న మృతదేహానికి నేడు రీ పోస్టుమార్టం జరపనున్నారు. కడపలో పోస్టుమార్టం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. వివేకానంద ఇంటి వాచ్ మెన్ రంగన్న మృతిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రీపోస్టుమార్టం కోసంనలుగురు వైద్యులతో కూడిన బృందం పులివెందులకు చేరుకుంది. సిట్, రెవెన్యూ అధికారుల సమక్షంలో రీ పోస్టుమార్టం జరగనుంది.   ఇదిలా ఉంటే.. వివేకాహత్య కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులోని ప్రత్యక్ష సాక్షి రంగన్న మృతిపై…

National

కన్నడ నటి బంగారం స్మగ్లింగ్ కేసులో కీలక వివరాలు వెలుగులోకి..

దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తీసుకొస్తూ పట్టుబడ్డ కన్నడ నటి రన్యా రావు కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అధికారుల విచారణలో రన్యా రావు గతేడాది 27 సార్లు దుబాయ్ వెళ్లి వచ్చిందని తేలింది. దుబాయ్ వెళ్లిన ప్రతిసారీ తిరిగి వస్తూ కిలోల కొద్దీ బంగారం బిస్కెట్లను రహస్యంగా దాచి తెచ్చిందని బయటపడింది. కిలో బంగారానికి రూ. లక్ష చొప్పున కమీషన్ అందేదని నటి వెల్లడించినట్లు అధికారులు తెలిపారు. విమానాశ్రయంలో ఓ కానిస్టేబుల్ సాయంతో ప్రత్యేక…

TELANGANA

రేవంత్ కేబినెట్.. బీసీల 42 శాతం రిజర్వేషన్లు, 11 వేల పోస్టులకు గ్రీన్‌సిగ్నల్..

తెలంగాణలో బీసీలకు విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రేవంత్‌రెడ్డి మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించేలా ఒక బిల్లు ముసాయిదా తీసుకురానుంది. అలాగే విద్యా సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రెండో బిల్లు ముసాయిదా తయారు చేశారు అధికారులు. ఈ రెండు బిల్లులను అసెంబ్లీలో ప్రవేశ పెట్టాలని మంత్రివర్గం తీర్మానం చేసింది. 2017లో అసెంబ్లీ ఆమోదించిన రిజర్వేషన్ల పాత…

TELANGANA

హైడ్రా, ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో హైదరాబాద్‌లో అరాచకం: కేటీఆర్..

హైడ్రా పేరుతో, ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో హైదరాబాద్‌లో అరాచకం సృష్టిస్తున్నారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ‘పడిపోయిన రిజిస్ట్రేషన్లు’ అంటూ వార్తాపత్రికలో వచ్చిన కథనాన్ని కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా పోస్టు చేస్తూ, రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.   అధికారం కోసం ఎల్ఆర్ఎస్‌ను రద్దు చేస్తామని చెబుతారని, అధికారం దక్కిన తర్వాత ఆదాయం కోసం ఎల్ఆర్ఎస్ ముద్దు అంటారని ఎద్దేవా చేశారు. హైడ్రా, ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో హైదరాబాద్‌లో అరాచకం సృష్టిస్తున్నారని ఆరోపించారు. మూసీ…

AP

విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..

ఏపీ సీఎం ఢిల్లీ టూర్ నేటితో ముగిసింది. మరికాసేపట్లో అమరావతి బయలుదేరనున్నారు సీఎం చంద్రబాబు. ఢిల్లీ పర్యటనలో భాగంగా.. నిన్న కేంద్ర మంత్రి మనోహర్ లాల్ కట్టర్ ను కలిశారు సీఎం చంద్రబాబు. రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులపై కేంద్రమంత్రి కట్టర్ తో చర్చించారు. విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు వందశాతం.. సాయం అందించండని కేంద్ర మంత్రి కట్టర్ ను కోరారు సీఎం చంద్రబాబు.   ఆంధ్రప్రదేశ్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి, ఆర్థిక వృద్దిని పెంపొందించడానికి పట్టణాల్లో…