మారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌లో టాప్ ఐఈడీ నిపుణుడు ‘టెక్ శంకర్’ మృతి
అల్లూరి జిల్లాలోని మారేడుమిల్లి ఏజెన్సీలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు హతమైన ఘటన సంచలనం సృష్టించింది. ఈ ఎదురుకాల్పుల్లో మృతి చెందిన వారిలో శ్రీకాకుళం జిల్లా, వజ్రపుకొత్తూరు మండలం, బాతుపురం గ్రామానికి చెందిన మెట్టూరి జోగారావు అలియాస్ “టెక్ శంకర్” ఉన్నారు. మూడున్నర దశాబ్దాలుగా సాయుధ పోరాటంలో అడవుల్లో తిరిగిన ఈ మావోయిస్టు నేత జీవితం తుపాకీ గుళ్లతో ముగిసింది. శంకర్ మృతితో అతని స్వగ్రామం బాతుపురం శోకసంద్రంలో మునిగిపోయింది. శంకర్ జీవితం 1988లో జరిగిన ప్రజా…

