ఐబొమ్మ రవి విచారణకు నిరాకరణ: ‘గుర్తులేదు, మర్చిపోయా’ అంటూ పోలీసులకు చుక్కలు!
సినిమా పైరసీ వెబ్‌సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి, పోలీసుల విచారణకు ఏమాత్రం సహకరించడం లేదు. కస్టడీలోకి తీసుకుని మూడో రోజు విచారణ చేస్తున్నా, తన వెబ్‌సైట్‌కు సంబంధించిన యూజర్ ఐడీ మరియు పాస్‌వర్డ్‌లు అడిగితే, ‘గుర్తులేదు.. మర్చిపోయా’ అంటూ పోలీసులను పదేపదే తప్పిస్తున్నాడు. అతని బ్యాంకు లావాదేవీలపై ఆరా తీసినా సరైన సమాధానం ఇవ్వకుండా పక్కకు తప్పుకుంటున్నట్లు సమాచారం. దీంతో పోలీసులు పలు బ్యాంకులకు రవి ఖాతాల జాబితాను తమకు తెలియజేయాలని కోరారు. రవి ప్రయాణించిన…

