News

TELANGANA

జీమెయిల్ లో కొత్త ఫీచర్..? ఇక ఆ మెయిల్స్‌కు చెక్..!

గూగుల్ తన జీమెయిల్ లో కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది, దీని పేరు ‘మేనేజ్ సబ్‌స్క్రిప్షన్స్’. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు తమ ఇన్‌బాక్స్‌లో అవసరం లేని సబ్‌స్క్రిప్షన్ మెయిల్స్‌ను ఒక్క క్లిక్‌తో అన్‌సబ్‌స్క్రయిబ్ చేసుకోవచ్చు.   ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుంది?   ‘మేనేజ్ సబ్‌స్క్రిప్షన్స్’ డాష్‌బోర్డ్ ద్వారా వినియోగదారులు తాము సబ్‌స్క్రైబ్ చేసుకున్న అన్ని మెయిలింగ్ లిస్ట్‌లను ఒకే చోట చూడవచ్చు. ఈ డాష్‌బోర్డ్‌లో మీకు అవసరం లేని మెయిల్స్‌ను గుర్తించి, వాటి పక్కన…

AP

ముగిసిన టీటీడీ పాలకమండలి సమావేశం… కీలక నిర్ణయాలు ఇవిగో..!

టీటీడీ పాలక మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. శ్రీ వారి భక్తులకు సేవలను మరింతగా పటిష్ఠం చేయటం పైన చర్చించారు. భక్తులకు వసతి పెంపు తో పాటుగా సీఎం ఆదేశాల మేరకు శ్రీవారి సేవా విధానంలో మార్పుల దిశగా కసరత్తు చేస్తున్నారు. అలిపిరి వద్ద మౌలిక వసతులతో పాటుగా.. వసతి గురించి సమావేశంలో చర్చ జరిగింది. పెరుగు తున్న భక్తుల రద్దీకి అనుగుణంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -3 నిర్మాణం పై బోర్డు…

AP

ఏపీ మామిడి రైతులకు కేంద్రం గుడ్ న్యూస్..!

ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ బంగారుపాళ్యం పర్యటనతో తోతాపురి మామిడి రైతుల కష్టాలపై మొదలైన చర్చకు కేంద్రం ముగింపు పలికింది. తోతాపురి రైతులకు మద్దతు ధర విషయంలో వైసీపీ వర్సెస్ టీడీపీ పోరు కొనసాగుతున్న తరుణంలో కేంద్రం దీనికి ఓ పరిష్కారం చూపింది. తోతాపురి మామిడి పళ్లకు మద్దతు ధరను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో రాజకీయాల సంగతి ఎలా ఉన్నా రైతులకు మాత్రం ఊరట లభించనుంది.   ఈ ఏడాది తోతాపురి మామిడికి…

National

యూపీఐ లావాదేవీల్లో భార‌త్ టాప్: ఐఎంఎఫ్‌..

యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) లావాదేవీల్లో ప్ర‌పంచంలోనే భార‌త్ టాప్‌గా నిలిచింద‌ని అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) తెలిపింది. ‘గ్రోయింగ్ రిటైల్ డిజిటల్ చెల్లింపులు: ది వాల్యూ ఆఫ్ ఇంటర్‌ఆపరబిలిటీ’ పేరిట‌ ఐఎంఎఫ్‌ ఇటీవల విడుదల చేసిన నోట్ ప్రకారం యూపీఐ వేగవంతమైన వృద్ధి కారణంగా భారత్‌ రియల్ టైమ్ డిజిటల్ చెల్లింపులలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచింది. నేడు మ‌న దేశంలో ప్ర‌తి నెలా 1800 కోట్ల‌కు పైగా యూపీఐ లావాదేవీలు జ‌రుగుతున్నాయ‌ని ఐఎంఎఫ్ పేర్కొంది.  …

National

శ్వాన్ సింగ్ చదువుల ఖర్చు భరించేందుకు నిర్ణయించిన భారత సైన్యం..! ఎవరూ ఈ శ్వాన్ సింగ్…?

పదేళ్ల వయసున్న శ్వాన్ సింగ్ అనే బాలుడి చదువుకు అయ్యే ఖర్చులను పూర్తిగా భరించేందుకు సైన్యంలోని గోల్డెన్ యారో డివిజన్ ముందుకు వచ్చింది. భారత సైన్యం ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఆ బాలుడు సైన్యానికి అందించిన సేవలే.   పంజాబ్‌లోని ఫిరోజ్‌పుర్ తారావాలీ గ్రామం అంతర్జాతీయ సరిహద్దుకు దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో అక్కడ భారీ సంఖ్యలో బలగాలను మోహరించారు. శత్రుదేశంతో భారత సైన్యం తలపడుతున్న సమయంలో ఆ…

AP

ఏపీ లిక్కర్ స్కామ్ కేసు… విచారణకు హాజరు కాలేనన్న మాజీ మంత్రి నారాయణస్వామి..

లిక్కర్ స్కామ్ కేసు ఏపీ రాజకీయాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో పలువురు అరెస్టయ్యారు. తాజాగా ఈ కేసులో మాజీ ఎక్సైజ్ మంత్రి నారాయణస్వామికి కూడా సిట్ నోటీసులు జారీ చేసింది. ఈరోజు ఉదయం 10 గంటలకు సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసులో సిట్ అధికారులు పేర్కొన్నారు. అయితే, ఈరోజు విచారణకు హాజరు కాలేనని సిట్ అధికారులకు నారాయణస్వామి సమాచారం అందించారు. అనారోగ్యం, వ్యక్తిగత కారణాల వల్ల ఈరోజు విచారణకు హాజరు కాలేనని…

AP

వైసీపీని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోంది: వైవీ సుబ్బారెడ్డి..

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై వైసీపీ కీలక నేత, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయని ఆయన మండిపడ్డారు. లేని లిక్కర్ కేసును బనాయించి వైసీపీని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.   ఈరోజు నుంచి పార్లమెంటు సమావేశాలు ఉన్నప్పటికీ… తమ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారని… ఇది చాలా దారుణమని సుబ్బారెడ్డి విమర్శించారు. వైసీపీ హయాంలో ఎక్సైజ్ పాలసీపై…

National

చిన్నస్వామి తొక్కిసలాట ఘటన.. కోహ్లీపై నిందలు వేస్తారా అంటూ బీజేపీ ఫైర్..!

ఐపీఎల్ విజయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఖాతాలో వేసుకోవాలని భావించిందని, ప్రమాదం జరిగిన తర్వాత విరాట్ కోహ్లీ, ఆర్సీబీని నిందిస్తోందని కర్ణాటక బీజేపీ విమర్శించింది. ఐపీఎల్ విజయోత్సవాల సందర్భంగా చిన్నస్వామి స్టేడియంలో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనపై కర్ణాటక ప్రభుత్వం ఇటీవల నివేదికను విడుదల చేసింది.   ఈ నివేదికలో కోహ్లీ, ఆర్సీబీని తప్పుబట్టింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై బీజేపీ మండిపడింది. రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతల నుండి తప్పుకోవాలని చూస్తోందని బీజేపీ నేత అరవింద్ విమర్శించారు.…

TELANGANA

బీఆర్ఎస్ నేతలు నా దారికి రావాల్సిందే.. కవిత సంచలన వాఖ్యలు..!

తీన్మార్ మల్లన్న తనపై చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు స్పందించలేదని ఆ పార్టీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పారు. బీఆర్ఎస్ నేతలు తన దారికి రావాల్సిందేనని సంచలన వ్యాఖ్యలు చేశారు.   బీసీ రిజర్వేషన్లపై రెండు బిల్లులు పెట్టాలని తొలుత డిమాండ్ చేసింది తానేనని కవిత చెప్పారు. న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాతే బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ నిర్ణయాన్ని సమర్థించినట్టు చెప్పారు.   కేంద్ర జలశక్తి మంత్రితో…

TELANGANA

కేసీఆర్ కుటుంబంపై కోర్టులకు వెళతాం: తీన్మార్ మల్లన్న..

బీఆర్ఎస్ ప్రభుత్వం పోవడం వల్లే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటపడిందని… లేకపోతే ఆ అరాచకం ఇప్పటికీ కొనసాగేదని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. కేసీఆర్ తో పాటు ఈ దారుణానికి పాల్పడిన ప్రతి ఒక్కరినీ శిక్షించాలని డిమాండ్ చేశారు. సిట్ పిలుపుతో తీన్మార్ మల్లన్న ఈరోజు విచారణకు హాజరయ్యారు. విచారణ సందర్భంగా మల్లన్న స్టేట్మెంట్ ను సిట్ అధికారులు నమోదు చేసుకున్నారు.   విచారణ అనంతరం మీడియాతో తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ… బీఆర్ఎస్ ప్రభుత్వం తనతో పాటు…