News

AP

త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం..

ఎన్నికల హామీలన్నింటినీ కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని ఏపీ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని కూడా త్వరలోనే అమల్లోకి తెస్తామని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే మెగా డీఎస్సీని అమలు చేస్తామని చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి పరీక్షలు నిర్వహించి జాయినింగ్ లెటర్స్ ఇస్తామని తెలిపారు.   భీమవరంలో కూటమి నేతలతో గొట్టిపాటి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై వారితో చర్చించారు.  …

TELANGANA

కుల సర్వే, బీసీలకు సీట్లు, ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..

తెలంగాణలో రాజకీయంగా, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం సీట్లు కేటాయిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. అన్ని రాజకీయ పార్టీలు కూడా బీసీలకు 42 శాతం సీట్లు కేటాయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీలో సామాజిక, ఆర్థిక, కుల గణనపై చర్చ సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు.   కుల సర్వేను మొత్తం నాలుగు భాగాలుగా విభజించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. వాటిలో మొదటి మూడు భాగాలను సభలో ప్రవేశపెడుతున్నామని…

National

చోరీ సొమ్ముతో సినీ నటికి రూ. 3 కోట్ల ఇల్లు..

చోరీలు చేస్తూ అప్పనంగా సంపాదించిన సొమ్ముతో తనకు పరిచయమైన ఓ సినీ నటికి రూ. 3 కోట్లతో ఇల్లు నిర్మించి ఇచ్చాడో చోర శిఖామణి. అంతేకాదు, అంత విలాసవంతమైన ఇంటికి మరింత అందాన్ని తెచ్చే పెట్టేందుకు రూ. 22 లక్షలతో ఆక్వేరియం కొని బహుమతిగా ఇచ్చాడు. తాజాగా ఓ కేసులో దొరికిన నిందితుడు విచారణలో చెప్పిన విషయాలు విని పోలీసులకు మతిపోయినంత పనైంది.   బెంగళూరు పోలీసుల కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని సోలాపూర్‌కు చెందిన పంచాక్షరి స్వామి…

National

ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ షురూ..

దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటింగ్ మొదలైంది. 1.56 కోట్ల మందికి పైగా ఢిల్లీ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.   ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 699 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 13,766 పోలింగ్ కేంద్రాల్లో అధికారులు వివిధ పార్టీల ఏజెంట్ల సమక్షంలో ముందుగా మాక్ పోలింగ్ నిర్వహించారు. అనంతరం ఓటింగ్…

AP

కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు నారా లోకేశ్ కీలక వినతి..

ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ నిన్న రాత్రి కేంద్ర రైల్వే, ఐటీ శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సమావేశమయ్యారు. దాదాపు రెండు గంటల పాటు ఆయన భేటీ కొనసాగింది. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి లోకేశ్ పలు కీలక వినతులు చేశారు.   కేంద్ర బడ్జెట్ లో ప్రకటించిన ఏఐ సెంటర్ అఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎడ్యుకేషన్ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్‌లో నెలకొల్పాలని లోకేశ్ కోరారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) తో రాబోతున్న…

National

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెర… ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం..

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ఎల్లుండి (ఫిబ్రవరి 5) 70 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఇందుకోసం ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈరోజు సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగిసింది. అధికారాన్ని నిలబెట్టుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ, అధికారం దక్కించుకోవాలని బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. బీజేపీ ఈ రోజు నగరంలో 22 రోడ్డు షోలు నిర్వహించింది.   ఎల్లుండి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఉత్తరప్రదేశ్, తమిళనాడులోని ఒక్కో అసెంబ్లీ స్థానంలో…

APTELANGANA

ఏపీ, తెలంగాణ విభజన అంశాలపై కేంద్ర హోంశాఖ కీలక సూచన..

ఉభయ తెలుగు రాష్ట్రాలు సమన్వయంతో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం అంశాలను పరిష్కరించుకోవాలని కేంద్ర హోంశాఖ సూచించింది. విభజన సమస్యలపై తెలుగు రాష్ట్రాల అధికారులతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వివిధ అంశాలపై చర్చించారు.   విభజన జరిగి పదేళ్లు దాటినా పలు అంశాలు ఇంకా పరిష్కారం కాలేదు. ఈరోజు జరిగిన సమావేశంలో విభజన చట్టంలోని 9, 10 షెడ్యూల్‌లోని సంస్థల ఆస్తులు, అప్పుల పంపకాలపై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. ఈ…

AP

పులివెందులకు ఉప ఎన్నిక..? ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఆసక్తికర వ్యాఖ్యలు..

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పులివెందులకు ఉప ఎన్నిక వచ్చే పరిస్థితులు ఉన్నాయని అన్నారు. అది ఎలాగో ఆయన వివరించారు.   ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యేగా జగన్ ఉన్నారని, ఆయన అసెంబ్లీ సమావేశాలకు రావడంలేదని వెల్లడించారు. ఓ ఎమ్మెల్యే ముందస్తు సెలవు కోరకుండా 60 రోజుల పాటు అసెంబ్లీకి రాకుండా ఉంటే… ఆ ఎమ్మెల్యేపై అనర్హత వేటు పడుతుందని రఘురామ తెలిపారు. ఈసారి గనుక జగన్ అసెంబ్లీకి రాకపోతే పులివెందులకు ఉప…

TELANGANA

తెలంగాణలో గ్రూప్ -1 ఫలితాల విడుదలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్..

తెలంగాణలో గ్రూప్ -1 ఫలితాల విడుదలకు సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపింది. గ్రూప్ -1 పై దాఖలైన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. తెలంగాణలో గ్రూపు – 1 మెయిన్స్ పరీక్షలు గత ఏడాది అక్టోబర్ 21 నుంచి 27 వరకు జరిగిన విషయం తెలిసిందే. మొత్తం 563 పోస్టులకు గాను 31,403 (క్రీడల కోటా కలిపి) మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షలకు అర్హత సాధించారు.   అయితే, జీవో నెం.29ని రద్దు చేయాలని, గ్రూప్ -1 మెయిన్స్…

TELANGANA

హైదరాబాద్ కి బుల్లెట్ రైలు.. ఎప్పుడంటే..?

హైదరాబాద్ వాసులు బుల్లెట్ రైలు ఎక్కే రోజులు ఎంతో దూరంలో లేవు. దేశంలోని ప్రధాన నగరాలను బుల్లెట్ రైలుతో అనుసంధానించే భారీ ప్రాజెక్టులో మరో కీలక అడుగు పడింది. హైదరాబాద్-ముంబై మధ్య 709 కిలోమీటర్ల మేర హైస్పీడ్ కారిడార్ నిర్మించాలని రైల్వే నిర్ణయించింది. ఈ కారిడార్‌ను బెంగళూరు వరకు విస్తరించాలని భావిస్తోంది. దీంతోపాటు మైసూరు-చెన్నై మధ్య నిర్మించ తలపెట్టిన హైస్పీడ్ రైలు కారిడార్‌ను కూడా హైదరాబాద్ వరకు విస్తరించాలని యోచిస్తోంది. అదే జరిగితే హైదరాబాద్ నుంచి ముంబై,…