News

TELANGANA

సింగపూర్ కంపెనీతో కీలక ఒప్పందం.. హైదరాబాద్‌లో కొత్త ఐటీ పార్క్..

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి టీమ్ సింగపూర్ పర్యటన మంచి ఫలితాలు వస్తున్నాయి. పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకొస్తున్నారు. ఆయా కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. తాజాగా హైదరాబాద్‌లో కొత్త ఐటీ పార్క్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది క్యాపిటల్యాండ్ కంపెనీ.   తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడుల వేట కొనసాగుతోంది. పెట్టుబడుల ద్వారా తెలంగాణ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో అడుగులు వేస్తోంది. మంచి ఫలితాలు రాబడుతోంది. మూడు రోజుల పర్యటనలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి టీమ్, సింగపూర్…

TELANGANA

కటింగులు, కటాఫ్ లు మినహా ఏడాది కాంగ్రెస్ పాలనలో ఒరిగిందేమిటి?: కేటీఆర్..

రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి విమర్శలు గుప్పించారు. ఎక్స్ వేదికగా విమర్శలు ఎక్కుపెట్టారు. కటింగులు, కటాఫ్ లు మినహా ఏడాది కాంగ్రెస్ పాలనలో తెలంగాణ సమాజానికి ఒరిగిందేమిటని ప్రశ్నించారు. రుణమాఫీ కటింగ్, రైతు భరోసా కటింగ్, సాగునీళ్లు కటింగ్, కరెంటు కటింగ్, కేసీఆర్ కిట్ కటింగ్, న్యూట్రిషన్ కిట్ కటింగ్, తులం బంగారం కటింగ్, మహాలక్ష్మి రూ. 2,500 కటింగ్, ఫించను రూ. 4,000 వేలు కటింగ్, రూ. 5 లక్షల…

AP

నేటి నుంచి సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన.. పెట్టుబడులే టార్గెట్..!

రాష్ట్రానికి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు దావోస్‌ పర్యటనకు వెళ్లారు. దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌ సదస్సుకు సీఎం వెళ్తున్నారు. సోమవారం నుంచి శుక్రవారం వరకూ సాగే ఈ పర్యటనలో దిగ్గజ పారిశ్రామికవేత్తల వరుస భేటీలతో సీఎం బిజీ బిజీగా గడపనున్నారు. ‘బ్రాండ్‌ ఏపీ’ ప్రమోషన్‌ పేరుతో దావోస్‌లో సీఎం బృందం ఐదు రోజుల పాటు పర్యటించనుంది. సీఎం చంద్రబాబు వెంట ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్‌, పరిశ్రమలశాఖ మంత్రి టీజీ భరత్‌,…

AP

ఏపీ కూటమిలో సైలెంట్ వార్..? ‘డిప్యూటీ సీఎం’ పదవి రచ్చ..?

ఏపీలో కూటమిలో డిప్యూటీ సీఎం పదవి పై రచ్చ మొదలైంది. నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం హోదా ఇవ్వాలని టీడీపీ ముఖ్య నేతలు డిమాండ్ చేస్తున్నారు. దీని పైన పవన్ మద్దతు దారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కు మాత్రమే ఆ హోదా ఉంటుందని చెప్పి.. ఇప్పుడు లోకేష్ గురించి ప్రతిపాదన చేయటం పైన జనసైనికులు మండి పడుతున్నారు. ఇదే అంశం పైన సోషల్ మీడియా వేదికగా పవన్ – లోకేష్ మద్దతు దారుల…

AP

ఏపీ కేబినెట్ నిర్ణయంపై సచివాలయ ఉద్యోగుల ఫైర్..

ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 15 వేల గ్రామ, వార్డు సచివాలయాలు అనుకున్నంత స్దాయిలో ప్రభావ వంతంగా పనిచేయడం లేదని భావిస్తున్న కూటమి సర్కార్ వాటిని ప్రక్షాళన చేయాలని నిర్ణయించింది. అలాగే అందులో పనిచేస్తున్న ఉద్యోగులను సైతం హేతుబద్ధీకరణ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ రెండు నిర్ణయాలకు రాష్ట్ర కేబినెట్ తాజాగా ఆమోద ముద్ర వేసింది. దీన్ని ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.   తాజాగా రాష్ట్ర కేబినెట్ లో తీసుకున్న గ్రామ, వార్డు సచివాలయ…

National

కేంద్రం కొత్త రూల్..! రోడ్డు నాణ్యత బాగోలేదా అయితే వాళ్లంతా జైలుకే..?

నిత్యం రోడ్లపై ఎన్నో ప్రమాదాలు జరుగుతుంటాయి. వాటిలో లెక్కలేనంత మంది గాయపడడమో, చనిపోవడమో జరుగుతూనే ఉంది. ఈ తరుణంలో కేంద్ర రోడ్డు, రవాణా శాఖా మంత్రి నితిన్ గడ్కర్ ఆసక్తకర కామెంట్లు చేశారు. దేశంలో నాణ్యత లేని రోడ్లు వేస్తే.. అందుకు కారణమైన వాళ్లను జైలుకు పంపాలంటూ వ్యాఖ్యానించారు. అవినీతి, అత్యాశ, లంచాలతో రోడ్ల నాణ్యతకు తూట్లు పొడిచేవారిని విడిచిపెట్టవద్దంటూ ఘాటూ వ్యాఖ్యాలు చేశారు. కేంద్ర మంత్రి వ్యాఖ్యాలు.. ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.  …

TELANGANA

ఫార్ములా -ఈ రేస్ కేసు.. ఏసీబీ ముందుకు ఏస్ నెక్ట్స్ జెన్ ప్రతినిధులు..

ఫార్ములా ఈ రేసు కేసు వ్యవహారం ఎంతవరకు వచ్చింది? ఈనెలాఖరులోగా విచారణ పూర్తి అవుతుందా? ఇటు ఏసీబీకి.. అటు ఈడీకి చిక్కిన, లభించిన ఆధారాలేంటి? ఈ కేసులో ఏసీబీ ముందు ఏస్ నెక్ట్స్ జెన్ ప్రతినిధులు హాజరవుతున్నారా? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.   ఫార్మాలా ఈ రేసు కుంభకోణంలో తీగ లాగితే డొంకంతా కదులుతోంది. ఈ కేసు ప్రారంభంలో మాజీ మంత్రి కేటీఆర్, ఐఏఎస్ అరవింద్ కుమార్, మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్‌రెడ్డి పేర్లు బయటకు…

TELANGANA

ఇంటర్ సిలబస్‌లో మార్పులు.. ఏఐ, డేటా సైన్స్‌కు చోటు..?

ఇంటర్ సిలబస్‌లో మార్పులు-చేర్పులు జరుగుతున్నాయా? మారిన సిలబస్ వచ్చే విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి రానుందా? కొన్ని పాఠాలను తొలగించాలని ఇంటర్ బోర్డు ఇప్పటికే నిర్ణయం తీసుకుందా? రాబోయే కొత్త పాఠాలేంటి? ఇవే ప్రశ్నలు చాలామంది స్టూడెంట్స్‌ను వెంటాడుతోంది.   మారుతున్న కాలానికి అనుగుణంలో ఇంటర్ విద్యలో మార్పులు చేయాలని తెలంగాణ బోర్డు ఆలోచన చేస్తోంది. ఇప్పటికే వేసిన కమిటీ కసరత్తు చేసింది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ, ఆర్ట్స్‌లో కొన్ని పాఠాలను తొలగించాలని నిర్ణయం తీసుకుంది. వాటి…

AP

ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్‌కు షాక్.. విచారణకు ఆదేశించిన ప్రభుత్వం..

ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్ కు ఏపీ సర్కార్ భారీ షాకిచ్చింది. సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్ పై విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ గా మారింది.   సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్ పై వచ్చిన అభియోగాలపై సాధ్యమైనంత త్వరగా విచారణ పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే. విజయానంద్ ఆదేశాలిచ్చారు. ప్రస్తుత డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామ…

AP

ఆ మూడు స్కీమ్స్ కి గ్రీన్ సిగ్నల్.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే..

ఏపీలో ఎప్పుడు ఎప్పుడు అంటూ ఆ పథకాల కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తాడేపల్లిలోని సీఎం కార్యాలయంలో శుక్రవారం ఏపీ కేబినెట్ భేటీ సాగింది. ఈ సమావేశానికి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇతర మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏపీకి సంబంధించిన పలు అంశాల గురించి సుధీర్గంగా చర్చ సాగింది. అలాగే రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధికి సంబంధించి తొలితగతిన నిర్మాణ పనులు సాగేలా చర్యలు…