News

AP

ఆక్వా రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..!

ఆక్వా రంగంపై ఆధారపడిన లక్షలాది రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల్ని భారీగా పెంచేసిన నేపథ్యంలో ఎగుమతులు జరగక ఇబ్బందులు పడుతున్న వేళ రొయ్యల రైతులు అడిగిన ఓ డిమాండ్ కు ప్రభుత్వం అంగీకరించింది. దీంతో రాష్ట్రంలో రొయ్యల తయారీ రైతులకు ఊరట దక్కబోతోంది. ఈ మేరకు రొయ్యల మేత తయారీ దారుల నుంచి ప్రకటన వెలువడింది.   రాష్ట్రంలో ఓవైపు అమెరికాకు ఎగుమతులు ఆగిపోయి రొయ్యల…

National

తమిళనాడులో బీజేపీ-అన్నాడీఎంకే పొత్తు..!

తమిళనాడులో అన్నాడీఎంకే, బీజేపీ పొత్తు ఖరారు అయింది. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయి. ఈ మేరకు కేంద్ర మంత్రి అమిత్ షా అధికారిక ప్రకటన చేశారు. పళనిస్వామి నాయకత్వంలోనే అన్నాడీఎంకే ఎన్నికలకు వెళుతుందని ఆయన స్పష్టం చేశారు.   అన్నాడీఎంకే అధినేత పళనిస్వామి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైతో కలిసి చెన్నైలో అమిత్ షా విలేకరుల సమావేశం నిర్వహించారు. 1998లో అప్పటి ముఖ్యమంత్రి జయలలిత నేతృత్వంలో బీజేపీ,…

AP

వచ్చే వారం నుంచి రూపాయి ఖర్చు లేకుండా పట్టా రిజిస్ట్రేషన్: మంత్రి నారా లోకేశ్..

వచ్చే వారం నుంచి రూపాయి ఖర్చు లేకుండా ఇంటి పట్టాలను రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని, రెండేళ్లలో ఇంటి పట్టా అమ్ముకునే హక్కు కూడా వస్తుందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. మన ఇల్లు-మన లోకేశ్ కార్యక్రమంలో భాగంగా నాలుగో రోజు మధ్యాహ్నం మంగళగిరి డాన్ బాస్కో స్కూల్ వద్ద ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన సభలో తాడేపల్లి మహానాడు ప్రాంతానికి చెందిన 430 మంది పేదలకు శాశ్వత ఇంటి పట్టాలు అందజేశారు. నేడు మొత్తం 1030 పేద…

TELANGANA

మూసీ పునరుజ్జీవంపై అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశాలు..

మూసీ పునరుజ్జీవంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రీజినల్ రింగ్ రోడ్డు పూర్తయ్యేలోపు మూసీ ప్రక్షాళన పూర్తి చేయాలని అన్నారు. హైదరాబాద్, బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.   ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, శ్రీనివాసరాజు, పలువురు ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇప్పటివరకు పనులు ఎంత వరకు వచ్చాయనే విషయాన్ని అధికారులను అడిగి ముఖ్యమంత్రి తెలుసుకున్నారు. ఇంకా మిగిలి ఉన్న పనులపై…

TELANGANA

తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల..

తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. పాఠశాల విద్యాశాఖ తెలిపిన వివరాల ప్రకారం… జూన్ 15 నుంచి 30వ తేదీ వరకు టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలను ఏప్రిల్ 15వ తేదీన అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించింది.   ఏప్రిల్ 15 నుంచి 30వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. జూన్ 15 నుంచి 30వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తారు. జులై 22వ…

APNational

ఇన్ స్టా ప్రేమాయణం..! అమెరికా అమ్మాయి.. ఆంధ్రా అబ్బాయి.. !

అమ్మాయిదేమో అమెరికా.. అబ్బాయి ఉండేదేమో ఆంధ్రాలోని ఓ పల్లెటూరు. ఇద్దరి మధ్యా వేల కిలోమీటర్ల దూరం ఉంది. ఈ దూరాన్ని ఇన్ స్టాగ్రామ్ చెరిపేసి ఆ ఇద్దరినీ కలిపింది. హాయ్ అనే మెసేజ్ తో మొదలైన పరిచయం పెళ్లి పీటల వరకూ చేరుకుంది. 14 నెలల పాటు ఆన్ లైన్ లోనే ప్రేమించేసుకున్న ఈ జంట త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనుంది. పెళ్లి కోసం తల్లితో కలిసి ఆ యువతి అమెరికా నుంచి ఆంధ్రాకు వచ్చింది. ప్రస్తుతం…

TELANGANA

రేవంత్ కు పౌరుషం లేదు… కేటీఆర్ ఓ బచ్చా: ధర్మపురి అర్వింద్..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శలు గుప్పించారు. తెలంగాణలో బీజేపీని అడ్డుకోవడం రేవంత్ వల్లే కాదు ఆయన బాస్ రాహుల్ గాంధీ వల్ల కూడా కాదని అన్నారు. తెలంగాణలో బీజేపీని అడుగు పెట్టనివ్వము అనేది అంత ఈజీ కాదని… తెలంగాణలో బీజేపీ రావడం అనేది తమ చేతుల్లో ఉందని చెప్పారు.   కేటీఆర్ కు ఉన్నంత దమ్ము, ధైర్యం కూడా నీకు లేదని… నిన్ను…

TELANGANA

తెలంగాణకు భూకంప హెచ్చరిక..!

తెలంగాణలోని రామగుండంలో భూకంపం సంభవించే అవకాశం ఉందని ‘ఎర్త్‌కేక్ రీసెర్చ్ అండ్ అనాలసిస్’ హెచ్చరికలు జారీచేసింది. తమ పరిశోధనల ప్రకారం రామగుండం సమీపంలో భారీ భూకంపం సంభవించే అవకాశం ఉందని, దాని తీవ్రత హైదరాబాద్, వరంగల్ నుంచి అమరావతి, మహారాష్ట్ర వరకు ఉండవచ్చని పేర్కొంది. అయితే, ఈ విషయాన్ని ప్రభుత్వం కానీ, శాస్త్రీయ సంస్థలు కానీ ధ్రువీకరించలేదు. భూకంపాలను ముందస్తుగా అంచనా వేయడం సాధ్యం కాదని అంటున్నారు.   తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు పసిఫిక్ జోన్ రెండు,…

AP

పురందేశ్వరికి కొత్త బాధ్యతలు..! మోదీ మార్క్ రాజకీయం..!

ఏపీలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. కూటమిలో మూడు పార్టీలు భాగస్వాములుగా కొనసా గుతూనే.. సొంతగా బలం పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. వరుసగా మూడో సారి కేంద్రం లో అధికారంలోకి వచ్చిన ప్రధాని మోదీ ఈ సారి దక్షిణాది పైన ప్రత్యేకంగా గురి పెట్టారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. అందులో భాగంగా తాజాగా తెలుగు వ్యక్తి కి పార్టీ జాతీయ అధ్యక్ష పదవి ఇచ్చే ఆలోచన చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. మరో వైపు…

AP

విజయవాడ మెట్రో ప్రాజెక్టుపై కీలక అప్డేట్..!

ఏపీలో కూటమి ప్రభుత్వం అమరావతి రాజధాని పనుల్ని తిరిగి ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న వేళ విజయవాడకు మరో గుడ్ న్యూస్ అందింది. రాష్ట్రంలో నిర్మించ తలపెట్టిన రెండు మెట్రో ప్రాజెక్టుల్లో ఒకటైన విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులో తొలి అడుగు పడింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా విజయవాడ నగరంలో ఏలూరు, బందర్ రోడ్డుల వైపు సేకరించాల్సిన భూమిని అధికారులు గుర్తించారు. దీంతో త్వరలో ఈ భూసేకరణ ప్రారంభం కాబోతోంది.   విజయవాడ నగరంలో మెట్రో ప్రాజెక్టును రెండు…