News

TELANGANA

మంత్రి పదవి పై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ అధిష్ఠానం ఆమోదం తెలిపినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు మంత్రి పదవి దక్కడం పక్కా అని, ఆ మేరకు పార్టీ హామీ ఇచ్చిందని తెలిపారు. అయితే, కొందరు కావాలనే రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాజీ మంత్రి జానారెడ్డి పేరును ప్రస్తావించారు.   ధర్మరాజులా వ్యవహరించాల్సిన జానారెడ్డి వంటి సీనియర్ నేతలు ధృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తున్నారని విమర్శించారు.…

TELANGANA

అమల్లోకి భూ భారతి చట్టం..!

ధరణిని రీప్లేస్‌ చేయబోతుంది భూభారతి. అంబేద్కర్ జయంతి రోజున అధికారికంగా సేవలను అందించేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం పైలెట్ ప్రాజెక్ట్‌గా మూడు మండలాల్లో అమలు చేయనుంది ప్రభుత్వం. ఇంతకీ ఈ పోర్టల్‌లో ఉండే సేవలేంటి? దాని వల్ల కలిగే ప్రయోజనాలేంటి?   ఆర్వోఆర్‌-2020 స్థానంలో ఆర్వోఆర్‌-2025 భూభారతి చట్టాన్ని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అమల్లోకి తీసుకురానున్నారు. దీంతోపాటు ధరణి స్థానంలో.. భూ భారతి పోర్టల్‌ సైతం అందుబాటులోకి రానుంది. మొదట మూడు మండలాల్లో పైలట్…

AP

365 రోజుల్లో వందపడకల ఆసుపత్రి..! మంత్రి నారా లోకేష్ ప్రకటన..!

మంగళగిరి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి ఆదర్శంగా నిలపడమే తన ధ్యేయమని రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే, రెండో కేబినెట్ సమావేశంలోనే మంగళగిరికి వంద పడకల ఆసుపత్రిని మంజూరు చేయించి, శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. రానున్న 365 రోజుల్లో ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు.   ఆదివారం మధ్యాహ్నం మంగళగిరి నియోజకవర్గం…

AP

రాజకీయాల్లోకి ఏబీ వెంకటేశ్వరరావు..!

రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మెరుగైన సమాజం కోసం పాటుపడాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని, పదవులపై ఎలాంటి ఆశ లేదని స్పష్టం చేశారు. అయితే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలను, అన్యాయాలను మాత్రం కచ్చితంగా ప్రజల ముందు ఉంచుతానని ఆయన పేర్కొన్నారు.   కోనసీమ జిల్లా, ముమ్మిడివరం మండలం ఠాణేలంక…

National

అమెరికా, చైనాల మధ్య వాణిజ్య పోరు..! కీలక లోహాల ఎగుమతి నిలిపివేత..!

అమెరికా, చైనాల మధ్య వాణిజ్య పోరు మరింత తీవ్రరూపం దాల్చింది. ఈ క్రమంలో, కీలకమైన రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, సంబంధిత లోహాలు, అయస్కాంతాల ఎగుమతిపై చైనా కఠిన ఆంక్షలు విధించింది. ఆయుధాలు, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, ఏరోస్పేస్, సెమీకండక్టర్లు సహా అనేక కీలక రంగాలకు అత్యవసరమైన ఈ ముడిసరుకుల సరఫరాను నియంత్రించడం ద్వారా పాశ్చాత్య దేశాలను, ముఖ్యంగా అమెరికాను ఇరుకున పెట్టేందుకు బీజింగ్ ప్రయత్నిస్తోంది.   ఎగుమతుల కోసం చైనా ప్రభుత్వం సరికొత్త నియంత్రణ వ్యవస్థను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.…

National

బెంగాల్ ఆందోళనలు హింసాత్మకం, ముగ్గురు మృతి, కేంద్ర బలగాల ఎంట్రీ..!

వక్ఫ్ సవరణ చట్టాని(Waqf Act)కి వ్యతిరేకంగా పశ్చిమబెంగాల్‌లో కొనసాగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ముర్షిదాబాద్, మాల్దా, సౌత్ 24 పరగణాలు, హుగ్లీ జిల్లాల్లో నిరసనకారులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగి రోడ్లను నిర్బంధించారు. కొందరు ఆందోళనకారులు హిందువుల నివాసాలు, వాహనాలు లక్ష్యంగా దాడులకు పాల్పడ్డారు. షాపులు, దుకాణాల్లో దూరిన కొందరు దొంగతనాలకు తెగబడ్డారు.   ఈ నిరసనలు ఉద్రిక్తతలకు దారితీయడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు పోలీసులు ధృవీకరించారు. ఘర్షణల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. కాల్పుల్లో…

AP

నిడదవోలు మున్సిపాలిటీ జనసేన కైవసం..!

ఏపీలో ఇప్పటికే పలు మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు వైసీపీ చేజారాయి. తాజాగా ఆ పార్టీకి మరో షాక్ తగిలింది. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మున్సిపాలిటీని జనసేన కైవసం చేసుకుంది.   నిడదవోలు మున్సిపాలిటీలో మొత్తం 28 మంది కౌన్సిలర్లు ఉండగా… వీరిలో 27 మంది వైసీపీ, ఒక టీడీపీ కౌన్సిలర్ ఉండేవారు. వైసీపీకి చెందిన కౌన్సిలర్లలో 14 మంది జనసేనలో చేరారు. దీంతో నిడదవోలు మున్సిపాలిటీ జనసేన వశమయింది. నిడదవోలు మున్సిపాలిటీ కూడా చేజారి పోవడంతో వైసీపీ…

TELANGANA

రాజీవ్ యువ వికాసం దరఖాస్తు ప్రక్రియలో తీవ్ర ఇబ్బందులు..

నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తు ప్రక్రియలో పలు సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. సర్వర్ లోపాలు తలెత్తడంతో దరఖాస్తు ప్రక్రియ నత్తనడకన సాగుతోంది.   ఇంటర్నెట్ సెంటర్లు, మీసేవ కేంద్రాల వద్ద దరఖాస్తుదారులు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. దరఖాస్తు చివరి దశకు చేరుకున్న సమయంలో సర్వర్ మొరాయించడంతో ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా, సాంకేతిక సమస్యల కారణంగా ఇదివరకే దరఖాస్తు చేసుకున్నట్లుగా చూపిస్తోందని…

TELANGANA

రాజాసింగ్‌తో బండి సంజయ్ భేటీ.. ‘కత్తర్ హిందూ’ అంటూ..

కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌తో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాజాసింగ్‌పై బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజాసింగ్ బీజేపీలో చాలా సీనియర్ నాయకుడని, హిందూ ధర్మం కోసం పోరాడే ‘కత్తర్ హిందువు’ (వీర హిందువు) అని ప్రశంసించారు. హిందూ సంస్కృతిపై దాడి జరిగిన ప్రతిసారి రాజాసింగ్ తన ప్రాణాలకు తెగించి పోరాడారని కొనియాడారు.   పాతబస్తీలోని ఆకాశ్‌పురి హనుమాన్ దేవాలయంలో పూజలు చేసిన అనంతరం రాజాసింగ్‌తో బండి సంజయ్ సమావేశమయ్యారు.…

AP

33 మందితో వైసీపీ రాజకీయ సలహా కమిటీ..! సజ్జలకు కీలక బాధ్యతలు..

వైసీపీ అధినేత జగన్ ఇవాళ తమ పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీని ప్రకటించారు. ఈ పీఏసీలో 33 మంది సభ్యులు ఉన్నారు. ఎంపీలు అవినాశ్ రెడ్డి, అయోధ్య రామిరెడ్డి, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ మంత్రులు రోజా, విడదల రజని, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అంజాద్ బాషా, ఆదిమూలపు సురేశ్, నారాయణస్వామి, అనిల్ కుమార్ యాదవ్ తో పాటు ముద్రగడ పద్మనాభం, సాకే శైలజానాథ్, నందిగం సురేశ్ తదితరులకు ఈ…