TELANGANA

సింగపూర్ కంపెనీతో కీలక ఒప్పందం.. హైదరాబాద్‌లో కొత్త ఐటీ పార్క్..

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి టీమ్ సింగపూర్ పర్యటన మంచి ఫలితాలు వస్తున్నాయి. పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకొస్తున్నారు. ఆయా కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. తాజాగా హైదరాబాద్‌లో కొత్త ఐటీ పార్క్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది క్యాపిటల్యాండ్ కంపెనీ.

 

తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడుల వేట కొనసాగుతోంది. పెట్టుబడుల ద్వారా తెలంగాణ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో అడుగులు వేస్తోంది. మంచి ఫలితాలు రాబడుతోంది. మూడు రోజుల పర్యటనలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి టీమ్, సింగపూర్ పారిశ్రామికవేత్తలతో సమావేశాలు, ఒప్పందాలు కుదుర్చుకుంటోంది.

 

ఈ క్రమంలో హైదరాబాద్‌లో కొత్త ఐటీ పార్క్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది క్యాపిటల్యాండ్ సంస్థ. దాదాపు రూ.450 కోట్లను పెట్టుబడి పెట్టనుంది. ఈ గ్రూప్ నేతృత్వంలో ఒక మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక ఐటీ పార్క్‌ అభివృద్ధి చేయనుంది. ఆ కంపెనీ ప్రతినిధులతో సమావేశం తర్వాత ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది.

 

క్యాపిటల్యాండ్ ప్రధాన కార్యాలయం సింగపూర్‌లో ఉంది. ప్రపంచంలో ప్రముఖ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీల్లో ఇది కూడా ఒకటి. వివిధ వ్యాపారాలు సైతం చేస్తోంది. రిటైల్ ఆఫీస్, లాజిస్టిక్స్, డేటా సెంటర్ల ద్వారా కార్యకలాపాలను విస్తరిస్తోంది. ఈ కంపెనీలో హైదరాబాద్‌లో మూడు రకాల వ్యాపారాలు చేస్తోంది.

 

ఇంటర్నేషనల్ టెక్ పార్క్-ఐటీపీహెచ్ ఒకటి. దీని రెండో దశ పునఃప్రారంభమవుతోంది ఈ ఏడాదిలో మొదలుకానుంది. గతంలో ప్రకటించిన విధంగా ఈ కంపెనీ రెడీ చేస్తున్న 25 మెగావాట్ల ఐటీ లోడ్ డేటా సెంటర్ ఈ ఏడాది మధ్యలో ప్రారంభం కానుంది