అంజనీకుమార్‌పై సస్పెన్షన్ వేటుపడిన నేపథ్యంలో తెలంగాణ నూతన డీజీపీగా రవిగుప్తా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రవిగుప్తా 1990 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారిగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగంతో పాటు ఏసీబీ డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
కాగా, ఇప్పటి వరకు తెలంగాణ డీజీపీగా ఉన్న అంజనీకుమార్‌పై కేంద్ర ఎన్నికల సంఘం సస్పెన్షన్ వేటు వేసిన విషయం తెలిసిందే. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినందుకు డీజీపీని సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలో డీజీపీ అంజనీకుమార్, ఇద్దరు అదనపు డీజీలు సందీప్ కుమార్ జైన్, మహేశ్ భగవత్.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
Ravi Gupta appointed as Telangana new DGP.
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో రేవంత్ రెడ్డిని కలవడంతో డీజీపీని సస్పెండ్ చేసిన ఈసీ.. ఇద్దరు అదనపు డీజీలకు నోటీసులు జారీ చేసింది. సీనియర్ ఐపీఎస్ అధికారిని డీజీపీగా నియమించాలని ఈసీ ఆదేశించింది. ఈసీ ఆదేశాల మేరకు అంజనీకుమార్ తర్వాత సీనియర్ అధికారిగా ఉన్న రవిగుప్తా బాధ్యతలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
కాగా, అసెంబ్లీ ఎన్నికలు వెలువడుతుండగానే డీజీపీగా ఉన్న అంజనీకుమార్, ఇతర ఉన్నతాధికారులు రేవంత్ రెడ్డిని కలిసి అభినందనలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాల్లో విజయం సాధించడంతో రేవంత్ రెడ్డికి శుభకాంక్షలు తెలిపారు. అంతేగాక, ప్రమాణ స్వీకారానికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఆ తర్వాత కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు 2+2 సెక్యూరిటీ అందించాలని డీజీపీ అంజనీకుమార్ ఆదేశించారు. ఇక ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి సంబంధించిన విషయాలపైనా రేవంత్ రెడ్డితో చర్చించినట్లు సమాచారం. ఎల్పీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం ఉందని చెప్పారు. అందుకు తగిన భద్రతా ఏర్పాట్లు చేసేందుకు కూడా సిద్ధమయ్యారు. అంతలోనే ఈసీ నిర్ణయం