TELANGANA

20 లక్షల రేషన్ కార్డుల తొలగింపు.. విచారణ చేయాలని డిమాండ్..

తెలంగాణలో వివిధ కారణాలతో ఏకపక్షంగా 20 లక్షల రేషన్‌కార్డుల తొలగింపుపై అధ్యయనం చేసేందుకు అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని అణగారిన వర్గాల హక్కుల కోసం పనిచేస్తున్న అసీమ్‌ అనే ఎన్‌జీవో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరింది. ఎండ్ టు ఎండ్ కంప్యూటరైజేషన్ ఆఫ్ టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద డేటా డిజిటలైజేషన్ తర్వాత, సాంకేతికత ఆధారిత గుర్తింపుతో కలిపి దాదాపు 2 లక్షల రేషన్ కార్డులను తెలంగాణ ప్రభుత్వం తొలగించిందని తెలిపింది.

 

క్షేత్ర స్థాయి విచారణలు నిర్వహించకుండా లేదా లబ్ధిదారులకు తగిన నోటీసులు అందించకుండా రేషన్ కార్డులు తొలగించారని హక్కుల సంఘం సభ్యులు తెలిపారు. 2021-2023 మధ్య సుప్రీంకోర్టు, హైకోర్టు తొలగించిన అన్ని రేషన్ కార్డుల రీసెర్టిఫికేషన్ నిర్వహించాలని పేర్కొన్నట్లు గుర్తు చేశారు. ఇ-శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసుకున్న రాష్ట్రంలోని వలస కార్మికులందరికీ కుటుంబ సభ్యుల జోడించాలని కోరారు.గత కొంత కాలంగా తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీ నిలిచిపోయింది. దీంతో లక్షలాది మంది అర్హులు రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. కొత్త వచ్చిన కాంగ్రె ప్రభుత్వం రేషన్ కార్డులు ఇస్తారని ఆశిస్తున్నారు. కాగా ప్రస్తుతం తెలంగాణ రేషన్ కార్డుల కేవైసీ ప్రక్రియ కొనసాగుతోంది. రేషన్ కార్డు ఉన్నవారందరు ఈ కేవైసీ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ కేవైసీకి చివరి తేదీ లేదని చెబుతున్నారు.