TELANGANA

కేంద్ర మంత్రిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ వైరల్‌

రెజర్ల నిరసనలపై స్పందించాలంటూ మీడియా ప్రశ్నించిన టైంలో కేంద్రమంత్రి మీనాక్షి లేఖి అక్కడ నుంచి పరుగుల తీసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

దీనిపై కాంగ్రెస్ నేతలు ఘాటుగా రియాక్ట్ అయింది. ఈ ఇష్యూపై తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా రీట్వీట్ చేశారు. ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

అయితే.. బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్‌ను అరెస్ట్ చేయాలని రెజ్లర్లు ఢిల్లీలో నెలరోజులుగా నిరసనలు చేస్తున్నారు. నిరసనను తీవ్రతరం చేస్తూ తమ పతకాలను సైతం గంగానదిలో పడేస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి మీనాక్షి లేఖి మీడియా కంటపడింది. రెజ్లర్ల సమస్యలపై స్పందించాల్సిందిగా విలేఖరి ఆమెను ప్రశ్నించడంతో.. అక్కడ నుంచి తప్పించుకుని పరుగులు తీసిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

చలో చలో అంటూ మంత్రి మీనాక్షి లేఖి తన కారువైపు పరుగులు పెట్టింది. సదరు రిపోర్టర్ ఆమె వెంటే పరుగులు తీస్తుంటే ఆ సమస్యను చట్టం చూసుకుంటుందని చెబుతూ తప్పించుకుంది. ఇక ఈ ఘటనపై తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ ‘నేను భాగ్.. మిల్కా.. భాగ్ గురించి విన్నాను.. ఈ భాగ్ మంత్రి భాగ్ ఏంటి? అంటూ పోస్ట్ పెట్టాడు.. మీ దగ్గర ఆన్సర్ లేనప్పుడు ప్రెస్‌ని, పబ్లిక్‌ని ఎదుర్కొనలేరు అనే క్యాప్షన్‌తో కేటీఆర్ ట్వీట్ ను తన ట్విట్టర్ అకౌంట్ లో చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. ఇక రెజ్లర్ల అంశంలో బ్రిజ్ భూషణ్ తనను ఢిల్లీ పోలీసులు విచారిస్తున్నారని తెలిపాడు. ఏం జరుగుతుందో చూద్దాం? నా పదవీ కాలం ముగిసింది.. నేను దోషిగా తేలితే నన్ను అరెస్టు చేస్తారు.. దానితో సమస్య ఏంటని ఆయన చెప్పడం గమనార్హం.