News

AP

పోలవరం పై ఏపీకి కేంద్రం బిగ్ అప్డేట్..

ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టు పై కీలక నిర్ణయం జరిగింది. డయాఫ్రం వాల్ నిర్మాణం పనులు ముందుకు సాగనున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి ఈ నిర్మాణం పూర్తయ్యేలా కార్యాచరణ సిద్దం అవుతోంది. ఈ మేరకు కేంద్ర జల సంఘం తమ నిర్ణయాన్ని పోలవరం ప్రాజెక్టు అథారిటీకి స్పష్టం చేసింది. దీని పైన చంద్రబాబు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే రేపు ( శనివారం) నుంచే పనులు ప్రారంభించేలా కసరత్తు జరుగుతోంది.  …

AP

ఏపీలో సచివాలయాలు రద్దవుతాయా..?

ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ పథకాలను లబ్దిదారులకు మెరుగ్గా అందిస్తామంటూ గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చింది. దాదాపు లక్షన్నర మంది ఉద్యోగుల్ని కూడా ఇందులో వివిధ విభాగాల కార్యదర్శులుగా నియమించింది. అయితే ఇంత పెద్ద వ్యవస్థ ఉండి కూడా ప్రభుత్వం ఆశించిన ప్రయోజనం జరగడం లేదని భావిస్తున్న కూటమి సర్కార్ ఇందులో ఉద్యోగుల హేతుబద్ధీకరణకు నిర్ణయం తీసుకుంది. అయితే ఉద్యోగుల నుంచి దీనిపై వ్యతిరేకత వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం…

TELANGANA

సింగపూర్‌లో సీఎం రేవంత్ టీమ్..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లారు. గురువారం రాత్రి సింగపూర్‌కు చేరుకున్నారు. శుక్రవారం నుంచి ఆదివారం వరకు అక్కడ పర్యటించనున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి వివిధ కంపెనీల ప్రతినిధులతో భేటీ కానున్నారు.   తొలుత సింగపూర్ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఇరుదేశాల మధ్య సంబంధాల నుంచి ఇరువురు చర్చించారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఇంధనం, నీటి నిర్వహణ, నదుల పునరుజ్జీవనం, పర్యాటకం, విద్య- నైపుణ్యాల అభివృద్ధి, ఐటీ…

TELANGANA

లైడిటెక్టర్ పరీక్షలకు సిద్ధమా? ఎవరు దొంగో తేలుతుంది.. రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్..

ఎన్ని ప్రశ్నలు అడిగినా… ఎన్నిరకాల పరీక్షలు పెట్టినా తాను భరిస్తానని… మరి సీఎం రేవంత్ రెడ్డి లైడిటెక్టర్ పరీక్షలకు సిద్ధమా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ చేశారు. తమపై ఉన్న కేసులకు సంబంధించి తామిరువురం ఒకేచోట కూర్చొని అధికారులు, ప్రజలు చూస్తుండగా ప్రశ్నిస్తే… అప్పుడు దొంగ ఎవరో తేలుతుందన్నారు. విచారణ అనంతరం ఆయన ఈడీ కార్యాలయం వెలుపల మీడియాతో మాట్లాడారు.   రేవంత్ రెడ్డిపై ఏసీబీ కేసు ఉందని, అందుకే తనపై కూడా ఏసీబీ…

National

ఢిల్లీలో ప్రారంభమైన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025..

దేశ రాజధాని ఢిల్లీలో భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన “భారత మండపం”, “యశోభూమి” కన్వెన్షన్ సెంటర్లలో “ఎక్స్‌పో” కొనసాగుతుంది. ఈ ఎక్స్‌పోలో ప్రపంచవ్యాప్తంగా పేరొందిన పలు రవాణా రంగ సంస్థలు భాగం కానున్నాయి. నేటి నుంచి జనవరి 22వ తేదీ వరకు గ్లోబల్ ఎక్స్‌పో కార్యక్రమం కొనసాగనుంది. ఈ ఎక్స్‌పోలో పెవిలియన్ ఏర్పాటు చేసిన మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రా‌స్ట్రక్చర్(MEIL)కు చెందిన “ఒలెక్ట్రా” సంస్థ.…

TELANGANA

ప్రతి పైసాకు నా దగ్గర లెక్కుంది.. KTR సంచలన వ్యాఖ్యలు…

తెలంగాణలో ఫార్ములా ఈ కార్ రేసింగ్ రేసులో బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఫార్ములా ఈ కార్ రేసింగ్‌లో ఎలాంటి నిబంధనలు పాటించకుండా రూ.55కోట్లు ఎలా బదలీ చేస్తారనే ఆరోపణలు ప్రధానంగా ఆయన ఎదుర్కొంటున్నారు. కేటీఆర్ ఈడీ ఆఫీస్‌కు చేరుకున్నారు. కాసేపట్లో ఆయనను ఈడీ అధికారులు విచారించనున్నారు.   అయితే ఇప్పటికే ఈ కేసులో కేటీఆర్‌ను జనవరి 9న విచారించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసిన…

AP

లిక్కర్, ఇసుక కుంభకోణాల్లో చాలా మంది జైలుకు వెళతారు: నారా లోకేశ్..

కనుమ పండుగ వేళ ఏపీ మంత్రి నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో లిక్కర్, ఇసుక కుంభకోణాల్లో త్వరలోనే చాలా మంది జైలుకు వెళతారని ఆయన అన్నారు. ఇందులో ఎలాంటి సందేహం లేదని చెప్పారు. రెడ్ బుక్ తన పని తాను చేసుకుపోతుందని అన్నారు. నారావారిపల్లెలో ఉన్న నారా లోకేశ్ ఈరోజు చంద్రగిరి నియోజకవర్గ ముఖ్య నేతలు, కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.   పార్టీ…

National

15 నెలల యుద్ధానికి స్వస్తి.. ఇజ్రాయెల్-హమాస్ మధ్య కుదిరిన డీల్…

ఇజ్రాయెల్-హమాస్ మధ్య 15 నెలలుగా జరుగుతున్న యుద్ధానికి ఫుల్‌స్టాప్ పడింది. ఇరు దేశాలు శాంతి ఒప్పందానికి అంగీకరించాయి. గాజాలో కాల్పుల విరమణకు అంగీకరించిన ఇజ్రాయెల్ తమ దళాలను వెనక్కి తీసుకునేందుకు ఓకే చెప్పగా, తమ అధీనంలో ఉన్న బందీలను విడిచిపెట్టేందుకు హమాస్ మిలిటెంట్ గ్రూప్ అంగీకరించడంతో కథ సుఖాంతమైంది.   ఈజిప్ట్, ఖతర్, ఇజ్రాయెల్‌తో కలిసి తాము కొన్ని నెలలపాటు జరిపిన దౌత్యం అనంతరం ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్టు అమెరికా అధ్యక్షుడు…

CINEMA

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై కత్తితో దాడి.. ఆరు చోట్ల గాయాలు..

బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దుండగుడు దాడిచేశారు. గుర్తు తెలియని వ్యక్తి ఒకరు ఆయన ఇంట్లోకి ప్రవేశించి కత్తితో ఆయనపై దాడిచేశాడు. ఈ ఘటనలో సైఫ్‌కు ఆరు చోట్ల గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో సైఫ్ చికిత్స పొందుతున్నాడు.   ఈ తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సైఫ్ కుటుంబం నిద్రలో ఉండగా ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు చోరీకి యత్నించాడు. అలికిడికి మెలకువ…

AP

ఏపీ వ్యాప్తంగా కోడి పందేల హోరు.. చేతులు మారిన వేల కోట్ల రూపాయలు..!

సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజులపాటు జరిగిన కోడి పందేల్లో వేల కోట్ల రూపాయలు చేతులు మారాయి. కోనసీమ నుంచి రాయలసీమ వరకు రాష్ట్రం కోడిపందేలతో హోరెత్తింది. ఎక్కడ చూసినా పందేలు జాతరను తలపించాయి. పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్క పందెమే రికార్డు స్థాయిలో రూ. 1.25 కోట్లు పలికింది. ఏలూరులో అయితే ఓ వ్యక్తి రూ. 2 కోట్ల పందేనికి సైతం సై అన్నాడు. తూర్పుగోదావరి జిల్లాలో 1500కుపైగా బరుల్లో పందేలు జరిగాయి. కోడి…