ఇస్రో-యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ మధ్య కీలక ఒప్పందం..
వ్యోమగాముల శిక్షణ, పలు పరిశోధనలకు సంబంధిత కార్యక్రమాలపై సహకారం కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో), యూరోపియన్ స్పేస్ ఏజన్సీ (ఈసా) మధ్య కీలక ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం (ఎంఓయూ) పై ఇస్రో చీఫ్ సోమనాథ్, ఈఎస్ఏ (ఈసా) డైరెక్టర్ జోసెఫ్ అప్చ్ బాచెర్ సంతకాలు చేశారు. రెండు సంస్థలు మానవ అన్వేషణ, పరిశోధనల్లో సహకరిస్తాయని ఇస్రో ప్రకటనలో పేర్కొంది. వ్యోమగామి శిక్షణ, ప్రయోగాలు, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో ఈసా సౌకర్యాల…

