News

AP

ఏపీలో ఇకపై బడుల్లో ప్రతి శనివారం ‘నో బ్యాగ్ డే’..

ఏపీ మంత్రి నారా లోకేశ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై బడుల్లో ప్రతి శనివారం ‘నో బ్యాగ్ డే’ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యపై నిన్న అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి.. పాఠశాలల్లో కో-కరికులమ్ కార్యకలాపాలు నిర్వహించాలని సూచించారు. ఇందులో భాగంగా ప్రతి శనివారం బ్యాగుల బరువు నుంచి విద్యార్థులకు విముక్తి కల్పించాలని, ప్రతి శనివారం ‘నో బ్యాగ్ డే’ నిర్వహించాలని సూచించారు.   అలాగే, ఉపాధ్యాయులకు ఇప్పుడున్న పలు యాప్‌ల స్థానంలో ఒకే…

AP

రైలు పట్టాలపై పడుకోబెడతా.. వారికి ఎమ్మెల్యే గుమ్మనూరు వార్నింగ్..

తనపై కొందరు మీడియా ప్రతినిధులు తప్పుడు ఆరోపణలు చేస్తూ వార్తలు రాస్తున్నారని మాజీ మంత్రి, గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మండిపడ్డారు. నిరూపించే దమ్ము ఉంటేనే వార్తలు రాయాలని… నిరూపించలేకపోతే రైలు పట్టాలపై పడుకోబెడతానని హెచ్చరించారు. ఎవడో డబ్బులు ఇస్తాడని తప్పుడు వార్తలు రాస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. తాను భూకబ్జాలకు పాల్పడ్డానని, నియోజకవర్గంలో తన కుటుంబ పెత్తనం ఉందంటూ కొందరు తనకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారని… వారంతా పద్ధతి మార్చుకోవాలని అన్నారు.…

National

కైలాస మానస సరోవర యాత్ర పునరుద్ధరణకు భారత్-చైనా అంగీకారం..

2020లో కరోనా సమయంలో నిలిచిపోయిన కైలాస మానస సరోవర యాత్రను పునరుద్ధరించేందుకు భారత్-చైనా దేశాలు అంగీకరించాయి. అలాగే, ఇరు దేశాల మధ్య విమాన సర్వీసులు కూడా తిరిగి ప్రారంభం కానున్నాయి. విదేశాంగ కార్యదర్శుల స్థాయిలో ఇరు దేశాల మధ్య రెండ్రోజుల పాటు జరిగిన చర్చల్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. చర్చల కోసం భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ బీజింగ్‌లో పర్యటించారు.   భారత ప్రధాని నరేంద్రమోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మధ్య అక్టోబర్‌లో రష్యాలోని…

TELANGANA

16 ఏళ్ల లోపు పిల్లలు సినిమా థియేటర్లకు వెళ్లే వేళలపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు..

తెలంగాణ హైకోర్టు పదహారేళ్లలోపు పిల్లలు సినిమా థియేటర్లకు వెళ్లే అంశంపై కీలక ఆదేశాలు జారీ చేసింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు పదహారేళ్లలోపు పిల్లలను థియేటర్లలోకి అనుమతించవద్దని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ విషయంపై అన్ని వర్గాలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించింది.   సినిమా టికెట్ ధరల పెంపు, ప్రత్యేక షోల అనుమతి అంశంపై దాఖలైన పిటిషన్లపై సోమవారం హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరపు…

AP

ఆంధ్రప్రదేశ్​ లో జిల్లాకో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్..

ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకూ సైబర్ నేరాలు పెరుగుతున్నాయని డీజీపీ ద్వారకా తిరుమలరావు చెప్పారు. వీటిని అరికట్టడానికి జిల్లాకు ఒక సైబర్ క్రైమ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు తెలిపారు. ఈమేరకు ఆయన శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సైబర్‌ క్రైమ్‌ ను నియంత్రించేందుకు కఠిన చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో సైబర్‌ క్రైమ్‌ పోలీసుస్టేషన్‌ పెట్టాలని భావిస్తున్నట్లు చెప్పారు. సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించి తద్వారా నేరస్థుల బారిన పడకుండా…

TELANGANA

రేవంత్ సర్కార్ కు షాక్.. ఇందిరమ్మ ఆత్మీయ భారోసాపై హైకోర్టులో పిల్..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జనవరి 26వ తేదీన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని ప్రారంభించింది. గత ప్రభుత్వాలకు భిన్నంగా భూమి లేని వ్యవసాయ కూలీలకు కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అందించాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఈ పథకాన్ని ప్రారంభించిన మరుసటి రోజే తెలంగాణ ప్రభుత్వానికి షాక్ ఇస్తూ ఈ పథకం పైన హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.   ఇందిరమ్మ ఆత్మీయ భారోసాపై హైకోర్టులో పిల్ నారాయణపేటకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్ అనే వ్యక్తి…

AP

విజయసాయిరెడ్డికి సీబీఐ షాక్..

వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సీబీఐ షాకిచ్చింది. విదేశీ పర్యటనకు అనుమతి కోరుతూ వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‎పై సోమవారం సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. ఫిబ్రవరి 10 నుంచి మార్చి10 వరకు ఫ్రాన్స్, నార్వే వెళ్లేందుకు విజయసాయిరెడ్డి న్యాయస్థానాన్ని అనుమతి కోరారు. అయితే విజయసాయిరెడ్డి వేసిన పిటిషన్‌కు సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. విజయసాయిరెడ్డి విదేశీ పర్యటనపై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది.   విజయసాయిరెడ్డి విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని…

TELANGANA

రైతు భరోసా నిధుల జమ- విడతల వారీగా, తాజా నిర్ణయం..!

తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా నిధులు జమ చేస్తోంది. చెప్పిన విధంగానే రిపబ్లిక్ రోజున సీఎం రేవంత్ నాలుగు సంక్షేమ పథకాలు ప్రారంభించారు. ఎకరాకు రూ.12 వేల చొప్పున రైతు భరోసా ఇస్తామని పేర్కొన్నారు. ప్రారంభం రోజు ఆదివారం కావడంతో రైతు భరోసా డబ్బులు జమకావని తేల్చి చెప్పారు. అర్ధరాత్రి తరువాత రైతుల ఖాతాల్లో నిధుల జమ మొదలైంది. ప్రభుత్వం ఖరారు చేసిన మార్గదర్శకాల మేరకు అర్హులైన రైతులకు నిధులు అందనున్నాయి. అయితే, గతంలో అమలు చేసిన…

TELANGANA

తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్..

తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మెకు సిద్దం అవుతున్నాయి. ఈ మేరకు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ సమ్మె నోటీసు ఇచ్చేందుకు నిర్ణయించాయి. ఈ సాయంత్రం ఆర్టీసీ ఎండీని కలిసి సమ్మె నోటీసు ఇవ్వనున్నారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న తమ డిమాండ్లను పరిష్కరించాల ని ఆర్టీసీ జేఏసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. దాదాపు నాలుగేళ్ల కాలం తరువాత తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పడుతున్నారు. దీంతో, ప్రభుత్వం అలర్ట్ అవుతోంది.   తెలంగాణ ఆర్టీసీ…

AP

క్రికెట్ అభిమానులకు అదిరిపోయో న్యూస్.. అమరావతిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం..

తెలుగు రాష్ట్రాల్లో క్రికెట్ అభిమానులకు ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం.. మంచి కిక్ ఇస్తోంది. సకల వసతులతో, అన్ని హంగులతో తీర్చిదిద్దాలని భావిస్తున్న రాజధాని అమరావతిలో దేశంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం నిర్మించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ – ఏసీఏ అధ్యక్షుు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ప్రకటించారు. ఇప్పటికే.. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అనేక ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపిన ఆయన.. కూటమి ప్రభుత్వం అధికారం ముగిసి ఎన్నికలకు వెళ్లే లోపుగానే…