News

AP

విజయసాయిరెడ్డిపై టీడీపీ నేతలు కుట్రలు చేశారు: కాకాణి గోవర్ధన్ రెడ్డి..

రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి చేసిన ప్రకటన రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ… తమ పార్టీలో విజయసాయి రెడ్డి కీలక నేత అని చెప్పారు. జగన్ సీఎం కావాలని ఆయన కలలు కన్నారని… ఇప్పుడు రెండోసారి జగన్ ను సీఎం చేసేందుకు పని చేస్తున్నారని అన్నారు. విజయసాయిపై కొందరు టీడీపీ నేతలు కుట్రలు, కుతంత్రాలు చేశారని…

AP

ముంబై దాడుల నిందితుడి అప్పగింతకు ఓకే చెప్పిన అమెరికా సుప్రీంకోర్టు..

ముంబైలో 2008లో జరిగిన ఉగ్రదాడికి సంబంధించి కీలక నిందితుడిని భారత్ కు అప్పగించేందుకు అమెరికా సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది. తనను భారత్ కు అప్పగించకుండా అడ్డుకోవాలంటూ నిందితుడు తహవుర్ రాణా దాఖలు చేసిన పిటిషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ కేసులో రాణా దోషిగా తేలిన నేపథ్యంలో నేరస్థుల అప్పగింత నుంచి మినహాయింపు పొందలేడని స్పష్టం చేసింది. తహవుర్ రాణాను అప్పగించాలంటూ భారత ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి అమెరికా గతంలోనే సానుకూలంగా స్పందించింది.   అయితే, రాణా…

TELANGANA

మహిళా కలెక్టర్‌ను అవమానించారు.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్షమాపణ చెప్పాలి: కవిత డిమాండ్..

మహిళా కలెక్టర్‌ను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అవమానించారని, ఇందుకు మంత్రితో పాటు కాంగ్రెస్ పార్టీ మహిళా నేతలు తక్షణమే కలెక్టర్‌కు క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. నిన్న కరీంనగర్ జిల్లా పర్యటనలో మహిళా కలెక్టర్ పమేలా సత్పతిపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ మీద మంత్రి చేసిన వ్యాఖ్యకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేసిన కవిత… తీవ్రంగా స్పందించారు.   ఇది కాంగ్రెస్‌ నాయకుల అహంకారానికి పరాకాష్ఠ అని…

National

ఒకరినొకరు పెళ్లి చేసుకున్న మహిళలు.. యూపీలో ఘటన..

భర్త నిత్యం తాగి వచ్చి తిడుతూ కొడుతుండడంతో విసిగిపోయిందో మహిళ.. తనలాంటి బాధితురాలు ఇన్ స్టాగ్రామ్ లో పరిచయం కావడంతో స్నేహం పెంచుకుంది. భర్తల ఆగడాలను ఇక భరించలేక ఇద్దరూ ఇంట్లోంచి వెళ్లిపోయి ఒకరినొకరు పెళ్లి చేసుకున్నారు.   ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఈ వింత పెళ్లి గురించిన వివరాలు.. యూపీకి చెందిన మహిళలు కవిత, గుంజ అలియాస్ బబ్లూలకు సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఇన్ స్టాగ్రామ్ లో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ ఒకేరకమైన సమస్యతో…

AP

జగన్ రెడ్డి, విజయసాయి కలిసి ఆడుతున్న డ్రామా ఇది: బుద్దా..

రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చేసిన ప్రకటన రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. విజయసాయి రాజీనామా అంశంపై ఇటు అధికార టీడీపీ, అటు ప్రతిపక్ష వైసీపీ నేతలు స్పందిస్తున్నారు. విజయసాయిరెడ్డి రాజీనామాపై టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న స్పందిస్తూ ఇది జగన్ రెడ్డి, విజయసాయిరెడ్డి కలిసి ఆడుతున్న డ్రామాగా అభివర్ణించారు. జగన్ కు తెలిసే అంతా జరుగుతుందన్నారు. వీళ్లిద్దరి కేసులు పక్కదారి పట్టించడానికి ఆడుతున్న నాటకం…

National

మణిపుర్‌లో బిజెపికి జేడీయూ షాక్..

ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌లో రాజకీయ పరిణామాలు తీవ్రంగా మారినట్లుగా కనిపిస్తున్నాయి. ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బిజేపీ)కి ఇంతవరకు మద్దతు ప్రకటించిన జనతా దళ్ యునైటెడ్ (జేడియూ).. తాజాగా తన మద్దతును ఉపసంహరించుకున్నట్లు ప్రకటన ఇచ్చింది. ఈ మేరకు జేడీయూ పార్టీ మణిపూర్ అధ్యక్షుడు క్షేత్రమయుం బీరెన్ సింగ్ (ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ కాదు) ప్రకటన జారీ చేశారు. మణిపూర్ లో తమ పార్టీ ఎన్డీఏ కూటమి నుంచి వైదొలుగుతోందని.. తమ పార్టీకి…

AP

బిల్ గేట్స్ తో సీఎం చంద్రబాబు భేటీ.. “ఎఐ” వర్సిటీల పై చర్చ..

మైక్రో సాఫ్ట్ అధినేత, ప్రపంచ ఐటీ దిగ్గజం బిల్ గేట్స్ తో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ దావోస్ ప్రొమెనేడ్ మైక్రోసాఫ్ట్ కేఫ్ లో భేటీ అయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నపుడు తమపై నమ్మకంతో మైక్రోసాఫ్ట్ ఐటీ కేంద్రాన్ని నెలకొల్పడంతో హైదరాబాద్ రూపురేఖలు మారిపోయిన విషయాన్ని బిల్ గేట్స్ కు చంద్రబాబు గుర్తుచేశారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఏపీలో ఐటీ అభివృద్ధికి సహాయ, సహకారాలను అందించాలని మంత్రి నారా…

AP

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. సరస్వతీ పవర్‌ప్లాంట్‌కు కేటాయించిన భూముల రిజిస్ట్రేషన్ రద్దు..

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి చెందిన సరస్వతీ పవర్ ప్లాంట్ కోసం కొనుగోలు చేసిన భూముల రిజస్ట్రేషన్‌ను కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. ఈ భూముల్లో అసైన్డ్, ప్రభుత్వ భూములు ఉన్నట్టు గుర్తించి ఈ నిర్ణయం తీసుకుంది. పల్నాడు జిల్లాలో సరస్వతీ పవర్ ప్లాంట్‌ కోసం కొనుగోలు చేసిన భూముల్లో మాచవరం మండలం వేమవరంలో 20 ఎకరాలు, పిన్నెల్లిలో 4.84 ఎకరాలను అసైన్డ్ భూములుగా ప్రభుత్వం గుర్తించింది.   సరస్వతీ పవర్ కోసం కొనుగోలు…

TELANGANA

హైదరాబాద్ లో ఘోరం… భార్యను చంపి కుక్కర్ లో ఉడికించాడు..!

తన భార్యను హత్య చేయడమే కాక మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి కుక్కర్‌లో ఉడికించి, ఆ తర్వాత ఆ అవశేషాలను చెరువులో పడవేశాడు ఓ రాక్షసుడు. ఆ తర్వాత తనకేమీ తెలియదన్నట్లు భార్య వెంకట మాధవి కనిపించడం లేదని అత్త సుబ్బమ్మతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ దారుణ ఘటన రంగారెడ్డి జిల్లా మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల దర్యాప్తులో అసలు విషయం బయటపడింది.   వివరాల్లోకి వెళితే.. జిల్లెలగూడ న్యూ వెంకటరమణ…

TELANGANA

హైదరాబాద్ లో విప్రో భారీ విస్తరణ.. దావోస్ వేదికగా ప్రకటన..

ఐటీ ఉద్యోగులకు గుడ్ న్యూస్. ప్రముఖ ఐటీ కంపెనీ విప్రో హైదరాబాద్ లో తమ క్యాంపస్ ను విస్తరించనున్నట్టు ప్రకటించింది. హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని గోపనపల్లిలో మరో ఐటీ సెంటర్ ను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది. ఈ సెంటర్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 5 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో విప్రో ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ రిషద్ ప్రేమ్ జీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్…