కవితపై ఈడీ ప్రశ్నల వర్షం.. ఢిల్లీ వెళ్లి ఎమ్మెల్సీని కలిసిన కేటీఆర్, హరీశ్ రావు..
దేశ రాజధాని ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో ఎమ్మెల్సీ కవితను ఆమె భర్త అనిల్ తోపాటు బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావు ఆదివారం కలిశారు. కవిత అరెస్టును సవాల్ చేస్తూ అనిల్ సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనున్నట్లు సమాచారం. కాగా, ఢిల్లీ మద్యం కేసులో శుక్రవారం అరెస్ట్ అయిన కవితకు రౌస్ ఎవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి మార్చి 23 వరకు ఈడీ కస్టడీ విధించిన విషయం తెలిసిందే. కవిత తొలిరోజు విచారణ పూర్తి …

