మల్కాజిగిరి, ఆదిలాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్..
వచ్చే లోక్‌సభ ఎన్నికలకు భారత రాష్ట్ర సమితి(BRS) మరో ఇద్దరు అభ్యర్థులను ప్రకటించింది. మల్కాజ్‌గిరి నుంచి లక్ష్మారెడ్డి, ఆదిలాబాద్ అభ్యర్థిగా ఆత్రం సక్కు పేర్లను బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గురువారం ఖరారు చేశారు. రాష్ట్రంలోని 17 స్థానాలకు ఇప్పటి వరకు బీఆర్‌ఎస్ 11 మంది అభ్యర్థులను ప్రకటించింది. సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని, పార్టీ ముఖ్యనేతలు, క్షేత్రస్థాయిలో అభిప్రాయాలు సేకరించి, అందరి ఏకాభిప్రాయంతో పార్టీ అధినేత కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించారు. కాగా,…

