News

TELANGANA

తెలంగాణకు రానున్న ప్రధాని మోడీ: షెడ్యూల్ ఇదే..

పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో అన్ని రాజకీయ పార్టీలు ప్రజల్లోకి వెళుతున్నాయి. బహిరంగ సభలు, ర్యాలీలు, యాత్రలు చేస్తున్నాయి. రాష్ట్రంలో మెజార్టీ ఎంపీ స్థానాలు దక్కించుకోవడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ నేతలు ప్రచార జోరును పెంచారు. రాష్ట్ర నేతలతోపాటు జాతీయ నేతలు కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. తాజాగా, ప్రధాని నరేంద్ర మోడీ కూడా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో దిగుతున్నారు.   ఇప్పటికే ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ నినాదంతో రాష్ట్రంలో విజయ సంకల్ప యాత్రలు చేస్తోంది…

TELANGANA

ఓఆర్ఆర్ టోల్ టెండర్లపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం..

ఔటర్ రింగ్ రోడ్డు(ORR) ఓఆర్‌ఆర్‌ టోల్ టెండర్లలో అవకతవకలపై విచారణ చేపట్టాలని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు ఓఆర్ఆర్ టోల్ టెండర్ల పూర్తి వివరాలు సమర్పించాలని హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఓఆర్ఆర్ టోల్ టెండర్లపై విచారణను సీబీఐ లేదా మరో సంస్థకు ఇవ్వాలని సీఎం నిర్ణయించారు.   బుధవారం హెచ్ఎండీఏ భవన్‌లో నిర్వహించిన సమీక్షలో ఔటర్ రింగ్ రోడ్డు టోల్ టెండర్లలో భారీగా అవకతవకలు జరిగాయని, దీనిపై సమగ్ర నివేదిక…

AP

7 లక్షలమందితో టీడీపీ- జనసేన ఉమ్మడి సభ..

రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల గడువు సమీపించిన నేపథ్యంలో ప్రతిపక్ష తెలుగుదేశం- జనసేన సంయుక్తంగా ఎన్నికల సమర శంఖాన్ని పూరించాయి. ఎన్నికల రణభేరిని మోగించాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఒకే వేదికపై కనిపించడంతో అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయింది.   పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం సమీపంలో గల ప్రతిపాడు వద్ద ఉమ్మడి బహిరంగ సభను ఏర్పాటు చేశాయి టీడీపీ-జనసేన. దీనికి తెలుగు జన విజయ కేతనం…

AP

వైసీపీలో ఇంఛార్జీల మార్పు.. 8వ జాబితా విడుదల..

అసెంబ్లీ ఎన్నికల కోసం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జీల మార్పు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ఏడు జాబితాలను ప్రకటించిన వైసీపీ.. తాజాగా మరో రెండు పార్లమెంట్ నియోజకవర్గాలు, 3 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన 8వ జాబితాను బుధవారం రాత్రి విడుదల చేసింది.   పార్లమెంట్ నియోజకవర్గాల్లో గుంటూరుకు కిలారు రోశయ్య, ఒంగోలుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఇంఛార్జీలుగా ప్రకటించింది. అసెంబ్లీ స్థానాల్లో పొన్నూరుకు అంబటి మురళి, కందుకూరుకు మధుసూదన్ యాదవ్, జీడీ నెల్లూరుకు కృపాలక్ష్మిని సమన్వయకర్తలుగా నియమిస్తూ…

National

ఎన్నికల వేళ.. ఆ వివాదాస్పద చట్టం అమలుకు కేంద్రం చర్యలు..

గతంలో దేశవ్యాప్తంగా కొన్ని నెలల పాటు హింసాత్మక పరిస్థితులు, దాడులు, నిరసన ప్రదర్శనలకు దారి తీసిన అత్యంత వివాదాస్పదమైన యాక్ట్.. జాతీయ పౌరసత్వ సవరణ చట్టం. ఇది మరోసారి తెర మీదికి వచ్చింది. సార్వత్రిక ఎన్నికల వేళ.. వివాదాలకు తెర తీసినట్టవుతోంది.   ఇంకొద్ది రోజుల్లో సార్వత్రిక ఎన్నికల షెడ్యుల్ వెలువడే అవకాశాలు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో.. పౌరసత్వ సవరణ చట్టాన్ని బీజేపీ ప్రస్తావనకు తీసుకుని రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సీఏఏను ఎప్పటి నుంచి అమలు చేస్తారనే…

TELANGANA

మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల..

తెలంగాణ రాష్ట్రంలో మరో ఉప ఎన్నికకు రంగం సిద్ధమైంది. మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 4న నోటిఫికేషన్ వెలువడనుండగా.. మార్చి 28న పోలింగ్ జరగనుంది.   ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన కసిరెడ్డి నారాయణ రెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఖాళీ అయిన ఈ ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక…

TELANGANA

రూ. 500కే గ్యాస్, ఉచిత విద్యుత్ పథకాలను ప్రారంభించిన రేవంత్..

తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక కష్టాలున్నా ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పటికే రెండు గ్యారంటీలు అమలు చేస్తున్నామని, తాజాగా మరో రెండు పథకాలు ప్రారంభించుకున్నామని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం మిగతా హామీలు కూడా ఒక్కొక్కటిగా తప్పకుండా అమలు చేస్తామని రేవంత్ స్పష్టం చేశారు.   కాగా, అభయహస్తం గ్యారంటీల్లో ఇప్పటికే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య శ్రీ రూ.10 లక్షలకు పెంపు పథకాన్ని అమలు…

AP

వైసీపీకి గుడ్ బై చెప్పనున్న రాయలసీమ మంత్రి..

ఏపీలో ఎన్నికల వేళ పార్టీ ఫిరాయింపులు ఊపందుకుంటున్నాయి. ఎన్నికల షెడ్యూల్ వెలువడేందుకు మరో వారం, పది రోజుల సమయం మాత్రమే ఉండటంతో ఆ లోపు తమకు సీటు కేటాయించే పార్టీలోకి వెళ్లి భవిష్యత్తుకు ఇబ్బంది లేకుండా చూసుకునేందుకు నేతలు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ ఇన్ ఛార్జ్ ల మార్పుల తర్వాత తలెత్తిన పరిస్ధితుల్లో సీటు కోల్పోయిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీలు ఫిరాయిస్తుండగా.. ఇప్పుడు ఓ మంత్రి కూడా పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు.   ఏపీలో వైసీపీ…

AP

అమరావతి రైతులకు హైకోర్టులో భారీ ఊరట..!

ఏపీలో ఎన్నికల వేళ అమరావతి రాజధాని వ్యవహారం మరోసారి తెరపైకి వస్తోంది. ఇక్కడ రైతులకు గతంలో టీడీపీ ప్రభుత్వం కేటాయించిన ప్లాట్లను రద్దు చేసేందుకు వీలుగా రైతులకు సీఆర్డీయే ఇచ్చిన నోటీసులు కలకలం రేపాయి. వీటిపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన రైతులకు ఇవాళ ఊరట లభించింది. ఈ నోటీసుల్ని రద్దు చేస్తూ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో గతంలో కేటాయించిన విధంగా యథాతథంగా వారికి ఈ ప్లాట్లు కొనసాగుతాయి.   గతంలో భూసమీకరణ కింద…

NationalTechnology

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఛైర్మన్‌ పదవికి విజయ్ శేఖర్ శర్మ గుడ్‌బై..

ప్రముఖ డిజిటల్ పేమెంట్, ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ వన్97 కమ్యూనికేషన్స్‌‌‌కు చెందిన పేటీఎం ఆర్థిక కార్యకలాపాలు, బ్యాంకింగ్ లావాదేవీలపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ మరోసారి స్పందించింది. కీలక ప్రకటన చేసింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లావాదేవీలపై నిషేధం విధించిన అనంతరం ఆర్బీఐ స్పందించడం ఇదే రెండోసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.   ఈ ప్రకటన తరువాత పేటీఎం షేర్ల ధరలు ఢమాల్ అయ్యాయి. పాతాళానికి పడిపోయాయి. ఒకదశలో 52 వారాల్లో గరిష్ఠంగా 998 రూపాయల వరకు వెళ్లిన…