News

TELANGANA

“గృహలక్ష్మి” నిబంధనలు ఖరారు – అమలయ్యేది వీరికే..!!

తెలంగాణ ప్రభుత్వం గ్యారెంటీల అమలు పై వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఇప్పటికే రెండు అమలు చేస్తోంది. మరో రెండు అమలు కోసం ముహూర్తం ఖరారు చేసింది. ఆరు గ్యారెంటీల్లోని రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌, ఒక్కో కుటుంబానికి రూ.200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు పథకాలను 27న ప్రారంభిస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు. అందులో గృహలక్ష్మి అమలు నిబంధనలు ఖరారయ్యాయి.   మరో రెండు గ్యారంటీల అమలు: తెలంగాణ ప్రభుత్వం హామీ…

TELANGANA

ధరణిపై రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు- సమగ్ర విచారణకు ఆదేశాలు ..

ధరణి పోర్టల్‌లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు మార్చి మొదటి వారంలోనే దీనికి సంబంధించిన చర్యలు తీసుకోవాలని అన్నారు. అన్ని మండల తహసీల్దార్ ఆఫీసుల్లో వీటిని పరిష్కరించడానికి ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తీసుకుని రావాలని చెప్పారు.   ధరణి కమిటీ చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకొని, పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి అవసరమైన విధి విధానాలను రూపొందించాలని రెవిన్యూ శాఖను రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా…

AP

టీడీపీ ఏ వర్గానికి ఎన్ని సీట్లు – జగన్ లెక్కలను సరి చేస్తాయా..!?

ఏపీలో ఈ సారి ఎన్నికల్లో సామాజిక లెక్కలు డిసైడింగ్ ఫ్యాక్టర్ గా మారనున్నాయి. చంద్రబాబు, జనసేన తమ తొలి అభ్యర్దుల జాబితా ప్రకటించాయి. సీఎం జగన్ సామాజి లెక్కలే ప్రధానంగా ఇంఛార్జ్ లను మార్పు చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు 94 మంది అభ్యర్దులను ప్రకటించారు. ఇందులో కొందరు సీనియర్ల సీట్లను పెండింగ్ లో పెట్టారు. ప్రకటించిన సీట్లలో అమలు చేసిన సామాజిక లెక్కలు ఇప్పుడు జగన్ సమీకరణాలను సరి చేస్తాయా లేదా అనే చర్చ మొదలైంది.…

AP

అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలిచే ప్రసక్తే లేదు- జనసేన సీనియర్ నేత బొలిశెట్టి..

రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల గడువు సమీపించిన నేపథ్యంలో ప్రతిపక్ష తెలుగుదేశం- జనసేన మధ్య ఎట్టకేలకు సీట్ల పంపకాల వ్యవహారం తేలింది. 118 మంది అభ్యర్థులతో కూడిన కూటమి అభ్యర్థుల తొలి జాబితాను టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు విడుదల చేశారు.   ఇందులో 94 నియోజకవర్గాల్లో టీడీపీ, 24 చోట్ల జనసేన అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. చంద్రబాబు, కింజరాపు అచ్చెన్నాయుడు, నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ వంటి ప్రముఖుల పేర్లు టీడీపీ…

National

‘ఢిల్లీ ఛలో’లో ఉద్రిక్తత.. వారి ఆస్తులు సీజ్..

‘ఢిల్లీ ఛలో’లో భాగంగా పంజాబ్-హరియాణా సరిహద్దులో ఇటీవల జరిగిన ఉద్రిక్త ఘటనలపై హరియాణా పోలీసులు జాతీయ భద్రతా చట్టం కింద చర్యలకు సిద్ధమయ్యారు. ముందుస్తుగా హెచ్చరించిన విధంగా పబ్లిక్ ప్రాపర్టీ ధ్వంసానికి పాల్పడినందుకుగాను.. పరిహారం కింద బాధ్యుల బ్యాంకు అకౌంట్లు, ఆస్తులు సీజ్ చేయనున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు ఈ ఘర్షణల్లో ఇద్దరు పోలీసులు చనిపోగా, మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డినట్లు తెలిపారు.

TELANGANA

నిందితురాలిగా కవిత..ఛార్జ్‌షీట్ ఫైల్ చేసిన సీబీఐ..

సంచలనం రేపిన ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత్ రాష్ట్ర సమితి సీనియర్ నాయకురాలు, శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత.. ఈ కేసులో విచారణను ఎదుర్కొంటోన్నారు. ఆమె చుట్టూ సీబీఐ ఉచ్చు పన్నినట్టే కనిపిస్తోంది.   ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసును దర్యాప్తు చేస్తోన్న సీబీఐ అధికారులు కవితకు ఇదివరకే సమన్లను జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 26వ తేదీన విచారణకు రావాల్సి ఉంటుందంటూ ఆదేశాలు ఇచ్చారు.…

TELANGANA

మేడారం సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్న రేవంత్.. మరో 2 పథకాలపై కీలక ప్రకటన..

తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని వన దేవతలను కోరుకున్నట్లు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. శుక్రవారం మధ్యాహ్నం ప్రత్యేక హెలికాప్టర్‌లో మేడారం చేరుకున్న సీఎం.. సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ములుగు జిల్లాతో, మంత్రి సీతక్కతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. ముఖ్యమైన కార్యక్రమాలన్నీ ఇక్కడ్నుంచే ప్రారంభించినట్లు గుర్తు చేశారు.   మేడారం జాతరలో భక్తులకు ఇబ్బందులు రాకుండా రూ. 110 కోట్లు మంజూరు చేసినట్లు సీఎం రేవంత్ తెలిపారు. మేడారం జాతరపై కేంద్రం వివక్ష…

AP

ఎన్నికల మేనిఫెస్టో పైన జగన్ కసరత్తు.

ఏపీలో ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. సీఎం జగన్ ఇప్పటికే మూడు సభల ద్వారా కేడర్ ను ఎన్నికలకు సంసిద్దులను చేసారు. చివరి సిద్దం సభ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేలా నిర్ణయించారు. ఈ నెల 3న చిలకలూరి పేటలో నాలుగు జిల్లాల పార్టీ కేడర్ తో సిద్దం సభ జరగనుంది. ఇటు ఎన్నికల మేనిఫెస్టో పైన జగన్ కసరత్తు ప్రారంభించారు. సిద్దం సభలో సీఎం జగన్ రుణమాఫీ ప్రకటించనున్నారు. పెన్షన్ పెంపు పైన స్పష్టత ఇచ్చే ఛాన్స్ ఉంది.…

AP

50 మందితో టీడీపీ తొలి జాబితా..

రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో- ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టారు. జనంలోకి వెళ్తోన్నారు. సిద్ధం పేరుతో ఏర్పాటు చేస్తోన్న భారీ బహిరంగ సభలతో ఎన్నికల యుద్ధానికి సన్నద్ధమౌతోన్నారు.   దీనికి పోటీగా తెలుగుదేశం పార్టీ కూడా రాష్ట్రవ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టింది. రా.. కదలిరా పేరుతో ఆ పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు బహిరంగ సభలను నిర్వహిస్తూ వస్తోన్నారు. అటు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి…

National

భారత నేవీలోకి 200 బ్రహ్మోస్..

భారత నేవీలో యుద్ధ నౌకల కోసం 200 బ్రహ్మోస్ ఎక్స్టెండెడ్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైళ్లు అందుబాటులోకి రానున్నాయి. మార్చి మొదటి వారంలో బ్రహ్మోస్ ఏరోస్పేస్, రక్షణశాఖ దీనిపై అధికారికంగా ఒప్పందం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. రూ.19 వేల కోట్లు విలువైన ఈ మెగా డీలు కేంద్ర కేబినెట్ కమిటీ ఆమోదించింది. మరోవైపు బ్రహ్మోస్ మిసైళ్ల ఎగుమతి కూడా త్వరలోనే ప్రారంభం కానుంది.