News

TELANGANA

బీజేపీకి 10 సీట్లు, తెలంగాణలో భారీ స్క్రీన్లలో రామ మందిర ప్రారంభోత్సవం: కిషన్ రెడ్డి..

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను దక్కించుకుంటామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan reddy) ధీమా వ్యక్తం చేషశారు. 10 ఎంపీ సీట్లు, 35 శాతం ఓటు బ్యాంకే లక్ష్యంగా కార్యాచరణ సిద్ధం చేస్తున్న బీజేపీ.. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నిర్వహించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర ఇంఛార్జిలు సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, అరవింద్ మీనన్ హాజరయ్యారు.…

TELANGANA

లోక్‌సభ బరిలో ఈటల.. రేవంత్ రెడ్డి స్థానంపై కన్ను

లోక్‌సభ ఎన్నికల గడువు సమీపించింది. ఇంకో రెండు నెలల్లో షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. తెలంగాణలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఈ ఎన్నికలను ఎదుర్కొనడానికి ముమ్మర కసరత్తు సాగిస్తోన్నాయి. గెలుపు గుర్రాల వేటలో పడ్డాయి.   తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలు ఉండగా.. అత్యధికం బీఆర్ఎస్ ఖాతాలో ఉన్నాయి. తొమ్మిది స్థానాల్లో గులాబీ జెండా ఎగురుతోంది. నాలుగు చోట్ల బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. మరో మూడింటిని కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఏఐఎంఐఎం ఒక స్థానాన్ని…

National

భారత్, మోడీపై అనుచిత వ్యాఖ్యలు: ముగ్గురు మాల్దీవుల మంత్రులపై వేటు, ప్రముఖుల కౌంటర్లు

భారత్, ప్రధాని నరేంద్ర మోడీపై మాల్దీవుల మంత్రులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై భారత పౌరుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. లక్షద్వీప్‌లో మోడీ పర్యటనను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలపై భారత ప్రముఖులు కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు. లక్షదీవుల అందాలను వివరిస్తూ సోషల్ మీడియా వేదికగా మాల్దీవుల మంత్రులకు కౌంటర్లు ఇస్తున్నారు. దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, జూనా అబ్రహాం, శ్రద్ధా కపూర్ వంటి వారు స్వదేశీ టూరిజానికి మద్దతుగా…

AP

ఎన్నికల వేళ అమరావతి కేంద్రంగా చంద్రబాబు కీలక ప్రకటన..!!

తెలుగుదేశం అధినేత చంద్రబాబు మరోసారి సీఎం జగన్ పై కీలక వ్యాఖ్యలు చేసారు. జగన్‌రెడ్డి రివర్స్‌ పాలనలో ఆంధ్రప్రదేశ్ 30 యేళ్లు వెనక్కిపోయిందని విమర్శించారు. ప్రపంచంలో తెలుగు జాతి నెంబర్ వన్‌గా ఉండాలనేదే తన ఆకాంక్ష అని వెల్లడించారు. మహిళలు అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. నిత్యావసర వస్తువల ధరలు పెరిగిపోయాయని చెప్పారు. విద్యుత్తు ఛార్జీలను తొమ్మిది సార్లు పెంచి జనాన్ని బాదుతున్నారన్నారు.   చంద్రబాబు వ్యాఖ్యలు: ఆదివారం తిరువూరులో జరుగుతున్న రా.. కదిలి రా…

AP

టీడీపీ వైపు వైసీపీ ఎంపీల చూపు..

ఏపీలో ఎన్నికల వేళ పార్టీ మార్పులు మొదలయ్యాయి. వైసీపీలో అభ్యర్దులు ఖరారులో సీఎం జగన్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఎంత ఒత్తిడి వచ్చినా గెలుపే ప్రామాణికంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ సమయంలో వైసీపీకి చెందిన ముగ్గురు ఎంపీలు టీడీపీ వైపు చూస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. దీని పైన వైసీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తేల్చి చెప్పారు.   వైసీపీలో ఇంఛార్జ్ ల మార్పు : వైసీపీలో ముఖ్యమంత్రి జగన్ ఎమ్మెల్యేలతో…

TELANGANA

తెలంగాణలో సమన్వయకర్తలను నియమించిన కాంగ్రెస్..

సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండటంతో కాంగ్రెస్ అధిష్టానం కసరత్తులు ముమ్మరం చేసింది. 28 రాష్ట్రాల్లోని ఎంపీ స్థానాలకు సమన్వయకర్తలను నియమించింది. తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల బాధ్యతలను పలువురు మంత్రులు, ముఖ్య నేతలకు అప్పగించింది.   మహబూబ్‌నగర్, చేవెళ్ల స్థానాల బాధ్యతలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇచ్చింది. హైదరాబాద్, సికింద్రాబాద్ నియోజకవర్గాలను ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమన్వయం చేయనున్నారు. మల్కాజిగిరికి తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం, మహబూబాబాద్ కు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వరంగల్‌కు కొండా సురేఖ, ఆదిలాబాద్…

TELANGANA

ప్రజాపాలనకు ప్రత్యేక వెబ్‌సైట్ ప్రారంభించినున్న సీఎం రేవంత్..

డిసెంబర్ 28 తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు నిర్వహించిన ప్రజాపాలనలో అందిన దరఖాస్తుల పరిశీలన, తదుపరి చేపట్టాల్సిన చర్యలపై సోమవారం నాడు డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.   ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి లతో పాటు వివిధ శాఖలకు చెందిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు,…

TELANGANA

రైతు రుణమాఫీ పై రేవంత్ గుడ్ న్యూస్ ..

ముఖ్యమంత్రి రేవంత్ రైతు రుణ మాఫీ అమలుపై కీలక ప్రకటన చేసారు. రైతు రుణమాఫీ దిశగా కీలక అడుగులు వేస్తున్నారు. త్వరలోనే రైతులకు ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ అమలుకు కార్యాచరణ ఖరారు చేసారు. అదే సమయంలో రైతుబంధు అమల్లోనూ సీలింగ్ పైన కసరత్తు చేస్తున్నారు. అసెంబ్లీ వేదికగా చర్చించిన తరువాత నిర్ణయం ప్రకటించనున్నారు. రైతు రుణమాఫీ కోసం కార్పోరేషన్ ఏర్పాటు తో పాటుగా నిధుల సమీకరణ పైన నిర్ణయం తీసుకున్నారు.   రుణమాఫీ కసరత్తు: కాంగ్రెస్…

TELANGANA

తెలంగాణలో దరఖాస్తుల ఉప్పెన…

తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి సారథ్యాన్ని వహిస్తోన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. పరిపాలనపై తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తోన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తోన్నారు. మౌలిక సదుపాయాల కల్పన, ఆరు ఉచిత గ్యారంటీల అమలు.. వంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడంపై దృష్టి సారించారు.   ప్రజా సమస్యలను పరిష్కరించే క్రమంలో పరి పాలనను వారి వద్దకే తీసుకెళ్తోన్నారు. ఈ క్రమంలో ప్రజా పాలన కార్యక్రమానికి తెర తీశారు. కిందటి నెల 28వ…

National

అయోధ్యా రాముడికి వెంకన్న చిరు కానుక..

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామాలయం నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. రామ మందిరం ప్రారంభోత్సవానికి ఎంతో సమయం లేదు. జనవరి 22వ తేదీన ఈ ఆలయాన్ని ప్రారంభించాల్సి ఉంది. మూడు రోజుల పాటు పండగలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది ప్రభుత్వం.   ప్రారంభోత్సవ గడువు సమీపిస్తోన్న నేపథ్యంలో నిర్మాణ పనులు వేగం పుంజుకొన్నాయి. మూడు షిఫ్టుల్లో పనులు కొనసాగుతున్నాయి. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా 4,000 వేలమంది ప్రముఖులు హాజరు కానున్నారు. అయోధ్య జిల్లా అధికార…