డెంగ్యూపై పోరులో కీలక ముందడుగు.. త్వరలో అందుబాటులోకి టీకా..!
దేశంలో ఏటా వర్షాకాలంలో లక్షలాది మందిని వణికిస్తున్న డెంగ్యూ మహమ్మారికి అడ్డుకట్ట వేసే దిశగా భారత్ కీలక ముందడుగు వేసింది. దేశీయంగా అభివృద్ధి చేసిన మొట్టమొదటి డెంగ్యూ వ్యాక్సిన్ క్లినికల్ ప్రయోగాలు తుది దశకు చేరుకున్నాయి. ప్రయోగాలు విజయవంతమైతే, ఏడాదిలోగా ఈ వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.ప్రఖ్యాత ఫార్మా సంస్థ సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) ఈ వ్యాక్సిన్ను అభివృద్ధి చేసింది. ‘టెట్రావ్యాక్స్-డీవీ’ పేరుతో రూపొందించిన ఈ టీకా…