కాళేశ్వరంపై కాంగ్రెస్-బీజేపీ కుమ్మక్కు.. కేటీఆర్ సంచలన ఆరోపణలు..
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ కలిసి కాళేశ్వరం ప్రాజెక్టును దెబ్బతీసేందుకు కుమ్మక్కయ్యాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు (కేటీఆర్) తీవ్రస్థాయిలో ఆరోపించారు. రాష్ట్రంలో కరవు పరిస్థితులు నెలకొంటున్న తరుణంలో, గోదావరి జలాలను ఉద్దేశపూర్వకంగానే సముద్రం పాలు చేస్తూ రైతులను ఇబ్బందుల్లోకి నెడుతున్నారని ఆయన మండిపడ్డారు. సోమవారం కరీంనగర్ జిల్లాలోని మిడ్ మానేరు జలాశయాన్ని సందర్శించిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. వేల టీఎంసీల గోదావరి జలాలు వృథాగా సముద్రంలోకి వెళ్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం…

