పవన్ కళ్యాణ్‌కు మంత్రి కోమటిరెడ్డి మాస్ వార్నింగ్
తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. కోనసీమలోని కొబ్బరి చెట్లు ఎండిపోవడానికి తెలంగాణ వాళ్ల దిష్టి తగలడమే కారణమని పవన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో, తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరింత సంచలనం సృష్టిస్తూ, “తెలంగాణ ప్రజల దిష్టి కాదు, ఆంధ్ర పాలకుల వల్ల తెలంగాణ ప్రజలు ఫ్లోరైడ్ విషం నీటిని తాగారు”…

