News

TELANGANA

అల్లు అర్జున్ కు గాయం చేశారు.. ఖాయంగా జాతీయ ఉత్తమ నటుడయ్యాడు

: ‘గాయంగాని చేశారంటే ఖాయంగా దేవున్నవుతాను’ ఇది పుష్ప సినిమాలో ఏయ్ బిడ్డా అనే పాటలో ఒక చరణం. ఇది అచ్చు గుద్దినట్టు అల్లు అర్జున్ కు సరిపోతుంది. అల్లు కుటుంబం నుంచి వచ్చినప్పటికీ అల్లు అర్జున్ నెగెటివిటీ నుంచి తప్పించుకోలేకపోయాడు. ఎందుకంటే దువ్వాడ జగన్నాథం సినిమా నుంచి అల్లు అర్జున్ ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యాడు. మరీ ముఖ్యంగా ‘నా పేరు సూర్య’ అనే సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దారుణంగా విఫలమైంది. దీంతో విపరీతమైన…

CINEMA

ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు!

తెలుగు సినిమా చరిత్రలో అరుదైన ఘట్టం నమోదైంది. హీరో అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. 69వ నేషనల్ అవార్డ్స్ భారత ప్రభుత్వం నేడు ప్రకటించింది. ఉత్తమ నటుడు కేటగిరీకి గట్టి ఏర్పడింది. పుష్ప లోని నటనకు గానూ అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. ప్రకటన రాగానే అల్లు అర్జున్ అభిమానుల్లో సంబరాలు అంబరాన్ని అంటాయి. సోషల్ మీడియాలో ఈ విషయాన్ని పెద్ద ఎత్తున ట్రెండ్ చేస్తున్నారు. 2021 డిసెంబర్ లో పుష్ప…

CINEMA

69వ నేషనల్ అవార్డ్స్: దుమ్మురేపిన తెలుగు సినిమా. మొత్తం ఎన్ని అవార్డ్స్ అంటే!

: నేడు 69వ నేషనల్ అవార్డ్స్ లలో తెలుగు సినిమా దుమ్ము దులిపింది. ఉత్తమ నటుడు, ఉత్తమ సింగర్, సంగీత దర్శకుడు, రచయిత అవార్డులతో పాటు మరికొన్ని కొల్లగొట్టింది. ముఖ్యంగా ఆర్ ఆర్ ఆర్ మూవీ ఐదు విభాగాల్లో నేషనల్ అవార్డ్స్ సొంతం చేసుకుంది. ఉత్తమ కొరియోగ్రాఫర్ గా నాటు నాటు సాంగ్ కి ప్రేమ్ రక్షిత్ అవార్డుకి ఎంపికయ్యారు. ఆర్ ఆర్ ఆర్ మూవీలోని కొమరం భీముడో సాంగ్ పాడిన కాల భైరవ ఉత్తమ సింగర్…

CINEMA

నేషనల్ అవార్డ్ ప్రకటించగానే సుకుమార్, అల్లు అర్జున్ ఏడ్చేశారు.. ఆ ఆనందం చూడాల్సిందే (వీడియో)

ఒక తెలుగు సినిమా హీరో జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా ఎంపికవ్వడం అంటే అంతకుమించిన క్రెడిట్ లేదు. ఇన్నాళ్లు కేవలం హిందీ సినిమాలు, హీరోలకు మాత్రమే ఈ ఘనత దక్కేది. వారికే అగ్రతాంబూలం ఉండేది. కానీ మన తెలుగు సినిమా సత్తా చాటింది. అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యాడు. పుష్ప చిత్రంలోని నటనకు గానూ ఆయనను ఈ ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. ఇలా నేషనల్ అవార్డ్స్ లో తెలుగు సినిమా సత్తా చాటింది. మొత్తంగా 11…

National

69వ నేషనల్ అవార్డ్స్ కంప్లీట్ విన్నర్స్ లిస్ట్.!

భారత ప్రభుత్వం ఢిల్లీ వేదికగా నేడు 69వ నేషనల్ అవార్డ్స్ ప్రకటించింది. ఇండియన్ సినిమాకు సంబంధించి వివిధ విభాగాల్లో ప్రతిభ చూపిన నటులు సాంకేతిక నిపుణులకు అవార్డ్స్ ఇవ్వడమైంది. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ ఎంపికయ్యాడు. ఈ విభాగానికి ఆర్ ఆర్ ఆర్ నుండి రామ్ చరణ్, ఎన్టీఆర్ అలాగే సూర్య, మలయాళ నటుడు టోవినో థామస్ తో పాటు పలువురు పోటీపడ్డారు. అయితే ఈ ప్రతిష్టాత్మక అవార్డు అల్లు అర్జున్ ని వరించింది. ఇక ఉత్తమ…

National

ఇస్రో సమస్యకు.. “తమిళ మట్టి” పరిష్కారం చూపింది..

చంద్రయాన్_3 విజయవంతమైంది. అందులోని లాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్ఞాన్ తొలి చిత్రాలను భూమి పైకి చేరవేశాయి. దీంతో శాస్త్రవేత్తలు ఆనందం మిన్నంటింది. అయితే అవి తర్వాత ఎలాంటి ప్రయోగాలు చేస్తాయి అనేది పక్కన పెడితే.. లాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్ఞాన్ కు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. చంద్రయాన్_3 లోని లాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్ఞాన్ చంద్రుడిపై కంటే ముందుగా తమిళ నాడు లోని నామక్కల్ జిల్లా మట్టిపై తొలి…

APNational

విక్రమ్‌, ప్రజ్ఞాన్‌.. చంద్రుడిపై ఏం చేస్తున్నాయంటే!

యావత్‌ ప్రపంచం ఒళ్లంతా కళ్లు చేసుకుని ఎదురు చూసిన చంద్రయాన్‌-3 దిగ్విజయమైంది. మరి ఇక్కడినుంచి ఏమిటి..? చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలిడిన అరుదైన ఘనతను మనకు అందించిన ల్యాండర్‌ విక్రమ్‌.. దాన్నుంచి బయటకు వచ్చే రోవర్‌ ప్రజ్ఞాన్‌ ఏం చేయనున్నాయి..? ఇవీ తెలుసుకోవాల్సిన అత్యంత కీలక అంశాలు. విక్రమ్‌ సారాభాయ్‌ పేరిట.. చంద్రయాన్‌-3లో అత్యంత ముఖ్యమైనది ల్యాండర్‌ ‘విక్రమ్‌’. భారత అంతరిక్ష పరిశోధన పితామహుడిగా కీర్తించే డాక్టర్‌ విక్రమ్‌ సారాభాయ్‌ పేరును దీనికి పెట్టారు. చంద్రుడి ఉపరితలంపై…

National

చంద్రుడు చేతికి చిక్కాడు. తర్వాత సూర్యుడే.. “ఇస్రో మిషన్” ఇంపాజిబుల్!

యావత్ భారత దేశ ప్రజల ఆశలను, ఆకాంక్షలను నిజం చేస్తూ చంద్రయాన్‌-3 విజయవంతమైంది. పట్టువదలని విక్రమ్‌ ల్యాండర్‌ జాబిల్లి నేలను ముద్దాడింది. దేశ అంతరిక్ష పరిశోధనల రంగంలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. మరి నెక్స్ట్‌ ఏంటి? ఇస్రో చేపట్టబోతున్న తదుపరి ప్రాజెక్టులేంటి? అంటే.. ఉన్నాయ్‌, చాలా ఉన్నాయ్‌. ఈ ప్రాజెక్టులతో ఇస్రో చాలా బిజీగా ఉండబోతోంది. ఆదిత్య ఎల్‌1 చందమామపై అడుగు పెట్టిన ఇస్రో తదుపరి లక్ష్యం సూర్యుడే. ఈ మిషన్‌లో భాగంగా మన శాస్త్రజ్ఞులు పీఎస్…

APTELANGANA

కుల, గుల పత్రిక అంటావా కేసీఆర్.. బట్టలు చింపుకున్న ఆర్కే

: ‘మీడియా అంటే న్యూట్రల్ గా ఉండాలి. వార్తలను వార్తలుగా రాయాలి. కేవలం విషం చిమ్మడమే పనిగా పెట్టుకోకూడదు. నేను ఉద్యమ సమయంలో నుంచి చెబుతూనే ఉన్నాను. కొన్ని కుల పత్రికలు, గుల పత్రికలు ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం మీద అవి విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నాయి. అటువంటి పత్రికలలో పనిచేసే పాత్రికేయులకు ఇళ్ళ స్థలాలు ఇవ్వబోం. ఇది మా ప్రభుత్వ పాలసీ.” ఇవీ నిన్న భారత రాష్ట్ర సమితి అభ్యర్థుల ప్రకటన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్…

TELANGANA

కేసీఆర్ ఎంట్రీ.. “కమలం”లో కుదుపు

నిన్న ఒకేసారి 115 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించి సంచలనం సృష్టించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. అదే దూకుడును కొనసాగిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. నిన్న సాయంత్రం దాకా అభ్యర్థుల పేర్లు ప్రకటించి హడావిడి సృష్టించిన ఆయన.. సాయంత్రం ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. ఇందులో భాగంగానే భారతీయ జనతా పార్టీ కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిని తన వద్దకు పిలిపించుకున్నారు. తనదైన ఓటు రాజకీయాలకు తెరదీశారు. అంతేకాదు ఎన్నికలకు ముందు కొత్తగూడెం కమలం పార్టీలో కల్లోలం సృష్టించారు.…