అమెరికా నుంచి భారీగా చమురు కొంటున్న భారత్..!
అంతర్జాతీయంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా భారత్ తన ఇంధన వ్యూహాన్ని వేగంగా మార్చుకుంటోంది. ఇందులో భాగంగా అమెరికా నుంచి ముడి చమురు దిగుమతులను భారీగా పెంచుతోంది. దేశంలోని అతిపెద్ద చమురు సంస్థ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), తాజాగా ఆగస్టు నెలలో దాదాపు 20 లక్షల బ్యారెళ్ల అమెరికా ముడి చమురుకు ఆర్డర్ ఇచ్చింది. ఈ చమురు అక్టోబర్ నాటికి భారత్‌కు చేరనుంది. ఇంధన అవసరాల కోసం కొన్ని దేశాలపైనే ఆధారపడకుండా, దిగుమతి వనరులను…