News

National

దిగొచ్చిన టమాటా ధరలు.. ఇక డొంట్ వర్రీ..

రాకెట్ వేగంతో దూసుకెళ్తున్న టమాటా ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. భారీగా పెరిగిన ధరలతో కొంత మంది టమాటాలు వాడడమే మానేశారు. కానీ గత మూడు రోజులు టమాటా ధరల్లో తగ్గుదల కనిపిస్తోంది. దిగుబడి పెరగడంతోనే టమాటా ధరలు తగ్గినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ కు టమాటా రాక పెరగడంతో ధరలు తగ్గాయి. హైదరాబాద్ లోని పలు రైతు బజారుల్లో కిలో టమాటా రూ.63 నుంచి రూ.70 పలుకుతోంది. ఇక రిటైల్ లో కిలో రూ.120 నుంచి రూ.140…

National

65 స్థానాలు గెలిస్తే కేంద్రంలో మనదే సర్కార్ అంటున్న కేసీఆర్..

65 ఎంపీ స్థానాలు గెలిస్తే కేంద్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. సోమవారం సాయంత్రం మహారాష్ట్రకు చెందిన కొంత మంది సర్పంచ్, ఉప సర్పుంచులు తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. మహారాష్ట్రలో 48 స్థానాలు, తెలంగాణలో 17 సీట్లలలో విజయం సాధిస్తే బీఆర్ఎస్ చక్రం తిప్పొచ్చని చెప్పారు. బీఆర్ఎస్ కు చెందిన 65 మంది ఎంపీల మద్దతు లేకుండా కేంద్రంలో ఏ ప్రభుత్వమూ రాదన్నారు. తెలంగాణలో…

National

అడుగు రూ.లక్ష పైనే: అమ్ముడుపోని ఆ రెండు ప్లాట్లు

హైదరాబాద్: హైదరాబాద్ నగర శివార్లల్లో నిర్వహిస్తోన్న భూముల ఇ-వేలంపాటలు తెలంగాణ ప్రభుత్వానికి కాసుల వర్షాన్ని కురిపిస్తోన్నాయి. మొన్నటి మొన్న కోకాపేట్‌లో హెచ్‌ఎండీఏ నిర్వహించిన ఇ-వేలంలో ఎకరం 100 కోట్ల రూపాయలను అధిగమించింది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చరిత్రలో కోకాపేట్‌ భూముల ధరలు సరికొత్త రికార్డు నమోదు చేశాయి. ఈ- ఆక్షన్‌లో టాప్ రియల్ ఎస్టేట్ కంపెనీలు స్థలాలను కొనుగోలు చేయడానికి పోటీ పడ్డాయి. వేలంలో అత్యధికంగా ఎకరం భూమి ధర గరిష్ఠంగా 100 కోట్ల రూపాయలను అందుకుంది.…

NationalTELANGANA

కేంద్రంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల తర్వాత సంకీర్ణ ప్రభుత్వమే

కేంద్రంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల తర్వాత సంకీర్ణ ప్రభుత్వమే వస్తుందని.. ఆ ప్రభుత్వంలో బీఆర్ఎస్ పాత్ర కీలకంగా ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో నిర్వహించిన చేనేత దినోత్సవంలో మంత్రి కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. 75 ఏళ్లు దాటిన చేనేత కార్మికులకు ప్రభుత్వమే బీమా కల్పిస్తుందని కేటీఆర్ తెలిపారు. కొత్త మగ్గాలకు తెలంగాణ చేనేత మగ్గం అని పేరు పెట్టామన్నారు. నేతన్నలకు 16 వేలకుపైగా…

TELANGANA

జంటనగరాల రోడ్లపై ఇక కొత్తగా ఎలక్ట్రిక్ సిటీ బస్సులు పరుగులు

జంటనగరాల రోడ్లపై ఇక కొత్తగా ఎలక్ట్రిక్ సిటీ బస్సులు పరుగులు తీయనున్నాయి. పర్యావరణ హిత ఎలక్ట్రిక్‌ బస్సులను టీఎస్ఆర్టీసీ అధికారులు అందుబాటులోకి తీసుకుని రానున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దశలవారీగా మొత్తం 1,300 ఎలక్ట్రిక్ బస్సులను వినియోగంలోకి తీసుకుని రావడానికి అధికారులు చర్యలు తీసుకుంటోన్నారు. కాలుష్యాన్ని నివారించడం, ప్రయాణికులకు మరింత మెరుగైన ప్రయాణ వసతిని కల్పించడంలో భాగంగా ఎలక్ట్రిక్ బస్సులను నడిపించనున్నారు. తొలి దశలో భాగంగా త్వరలో 25 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను వివిధ మార్గాల్లో నడిపించనున్నారు.…

APTELANGANA

కొత్తగూడెం బీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావుకు సుప్రీం కోర్టులో ఊరట

కొత్తగూడెం బీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావుకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. వనమా వెంకటేశ్వరరావుపై అనర్హత వేటు వేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం స్టే విధించింది. కేసులో ప్రతివాదులుగా ఉన్నవారికి నోటీసులు ఇచ్చింది. రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. ఆ తర్వాత హైకోర్టు తీర్పు చెల్లుబాటు అవుతుందో లేదో తెలుస్తామని తెలిపింది. తదుపలి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. 2018 ఎన్నికల అఫిడవిట్లలో సమాచారం దాయడంతో వనమా వెంకటేశ్వర్‌రావు…

National

సీఎం కేసీఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయం

సీఎం కేసీఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ ఒక్క నిర్ణయం 43 వేల మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చింది. నిత్యం 45 లక్షల మంది ప్రయాణీకులకు సేవలు అందిస్తున్న టీఎస్ఆర్టీసీ ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థగా మారింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా ఏటా రూ 3 వేల కోట్ల భారం పడనుంది. ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తరువాత అనేక కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎట్టకేలకు కార్మికుల మనోభీష్టం నెరవేరింది. విలీనం బిల్లుకు…

World

20 బంతుల్లో 1 పరుగు.. 3 వికెట్లు

ఆస్ట్రేలియా యువ పేసర్‌ స్పెన్సర్‌ జాన్సన్‌ సంచలన స్పెల్‌తో మెరిశాడు. ది హండ్రెడ్‌ లీగ్‌లో అరంగేట్రంలోనే అత్యద్భుత గణాంకాలు నమోదు చేశాడు. 20 బంతుల్లో కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి ఏకంగా మూడు వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లండ్‌ హండ్రెడ్‌ లీగ్‌లో జాన్సన్‌ ఓవల్‌ ఇన్విసిబుల్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో లండన్‌లోని కెన్నింగ్‌టన్‌ ఓవల్‌ వేదికగా మాంచెస్టర్‌ ఒరిజినల్స్‌తో మ్యాచ్‌లో అద్భుత ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. అంతర్జాతీయ టీ20 జట్టుకు ఎంపికైన మరుసటి రోజే 20…

TELANGANA

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో ఎందుకు విలీనం చేయాల్సి వచ్చిందనే విషయాన్నీ కేసీఆర్ స్పష్టం

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఇవ్వాళ ముగియనున్నాయి. ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో ప్రసంగిస్తోన్నారు. ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తిన పలు ప్రశ్నలు, ఇతర అంశాలను ఆయన ప్రస్తావించారు. రాష్ట్రాభివృద్ధి విషయానికి సంబంధించిన విషయాలను కేసీఆర్ సభ దృష్టికి తీసుకొచ్చారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో ఎందుకు విలీనం చేయాల్సి వచ్చిందనే విషయాన్నీ కేసీఆర్ స్పష్టంగా సభకు వివరించారు. ప్రజా రవాణాను ప్రోత్సహించడంలో భాగంగా ఆర్టీసీని ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో తాను…

NationalTELANGANA

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల వరాలు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల వరాలు ప్రకటిస్తున్నారు. మరి కొద్ది నెలల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వరుసగా అన్ని వర్గాలను ఆకట్టుకొనే నిర్ణయాలు తీసుకుంటున్న సీఎం కేసీఆర్ ఇప్పుడు ఉద్యోగులకు సంబంధించిన నిర్ణయాల ప్రకటను సిద్దమయ్యారు. ఈ రోజు అసెంబ్లీలో ఉద్యోగుల పీఆర్సీ తో పాటుగా మధ్యంతర భృతి (ఐఆర్‌)ని ప్రకటిస్తారని భావిస్తున్నారు. దీంతో పాటుగా మరిన్ని కీలక ప్రకటనలు చేయనున్నారు. నేటితో సమావేశాల ముగింపు: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజుతో ముగియనున్నాయి. ఎన్నికల…