News

CINEMA

సూపర్ స్టార్ వద్ద రూ.25 కోట్లు అప్పు

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటిస్తోన్న లేటెస్ట్ మూవీ.. ఖుషీ. విజయ్ దేవరకొండ హీరో. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. కాశ్మీర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ మూవీలో మలయాళ నటుడు జయరాం, సతీష్ ఖెడేకర్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్.. ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తోన్నారు. సెప్టెంబర్ 1న విడుదల కానుంది. సమంత కొంతకాలంగా మయోసైటిస్‌తో బాధపడుతున్న విషయం తెలిసిందే. అమెరికాలో ట్రీట్‌మెంట్ తీసుకోనున్నట్లు వార్తలొస్తోన్నాయి. చికిత్స…

National

రైల్వే స్టేషన్లు భవిష్యత్‌లో ఇలా ఉండబోతోన్నాయ్..!!

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేడు చారిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టబోతోన్నారు. ఒకేసారి దేశంలో 508 రైల్వే స్టేషన్‌ల ఆధునికీకరణ పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద మొత్తంగా 24,470 కోట్ల రూపాయల వ్యయంతో రైల్వే మంత్రిత్వ శాఖ ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టింది. ఆయా రైల్వే స్టేషన్లన్నీ కూడా మల్టీ పర్పస్ సెంటర్లుగా ఆవిర్భవించనున్నాయి. సిటీ సెంటర్స్‌గా అభివృద్ధి చెందనున్నాయి. దీనికి అవసరమైన మాస్టర్ ప్లాన్‌ను రైల్వే శాఖ ఇదివరకే సిద్ధం…

CINEMA

కోర్టుకెక్కిన పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్

హైదరాబాద్: దక్షిణాదిన డెస్టినేషన్ సిటీగా ఆవిర్భవిస్తోన్న హైదరాబాద్‌లో మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది. దీని నిర్మాణ పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి. త్వరలోనే ఇది సందర్శకులకు అందుబాటులోకి రానుంది. చారిత్రాత్మక కట్టడాలు, పర్యాటక కేంద్రాలకు కేంద్రబిందువైన భాగ్యనగరానికి అదనపు అందాన్ని తెచ్చి పెట్టేలా ఈ ప్రాజెక్ట్‌ను తీర్చిదిద్దుతోంది తెలంగాణ ప్రభుత్వం. దేశంలోనే అతిపెద్ద అక్వేరియాన్ని ప్రభుత్వం నిర్మిస్తోంది. రంగారెడ్డి జిల్లా కొత్వాల్‌గూడలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఎకో పార్క్‌లో ఈ అక్వేరియం నిర్మాణ పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయి.…

National

తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలి.

హైదరాబాద్ : తెలంగాణ బీజేపి కార్యక్రమాల రూపకల్పనలో వేగం పెంచింది. అన్ని రంగాల్లో పార్టీని పట్టాలెక్కించి పరుగులు పెట్టించేందుకు సన్నాహాలు ముమ్మరం చేస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ మీడియా, సోషల్ మీడియా వర్క్ షాప్ కొనసాగుతోంది. వర్క్ షాప్ లో బీజేపీ శ్రేణులకు ఎంపి, బీజేపి రాష్ట్ర ఎన్నికల ఇంచార్జి ప్రకాష్ జవదేకర్, బీజేపి జాతీయ అధికార ప్రతినిధి సయ్యద్…

National

కేటీఆర్ వ్యాఖ్యలకు పీసిసి అద్యక్షుడు రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు.

తెలంగాణ శాసన సభలో మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు పీసిసి అద్యక్షుడు రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. అమెరికాలో తాను విద్యత్ గురించి ఏం మాట్లాడాను, ఆ వ్యాఖ్యలను ఎలా వక్రీకరిస్తున్నారో శాసనసభలో శ్రీధర్ బాబు వివరణ ఇస్తుంటే మంత్రులు అడ్డుకుంటున్నారనన్నారు రేవంత్ రెడ్డి. సభలో వాస్తవాలు చెప్పే అవకాశం ఇవ్వనంత మాత్రాన ప్రజలకు నిజాలు తెలియకుండా ఉంటాయా అని రేవంత్ ప్రశ్నించారు. సీతక్క ఎందుకు కన్నీళ్లు పెట్టుకుంది : వరద బాధితులను ప్రభుత్వం ఆదుకుని ఉంటే సీతక్క…

National

ప్రయాణికుల కోసం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ ట్రావెల్ అడ్వైజరీ- విజ్ఞప్తి

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రయాణికుల తాకిడి పెరిగింది. రద్దీ అసాధారణ స్థాయిలో ఉంటోంది. కొద్దిరోజులుగా ఇవే పరిస్థితులు నెలకొంటోన్నాయి. విమానం ఎక్కే తమ ఆప్తులకు సెండాఫ్ ఇవ్వడానికి వచ్చే కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సంఖ్య భారీగా ఉంటోంది. ఫలితంగా- వాహనాల రాకపోకలు తరచూ స్తంభిస్తోన్నాయి. ప్రత్యేకించి- ఈ మధ్యకాలంలో విదేశాల్లో చదువుకోవడానికి వెళ్లే విద్యార్థుల రద్దీ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పెద్ద సంఖ్యలో ఉంటోంది. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్, జర్మనీ, న్యూజిలాండ్, ఇటలీల్లో సాధారణంగా ఆగస్టు/సెప్టెంబర్ నెలల్లో…

National

ఎన్నికల బరిలో రాహుల్ సిప్లిగంజ్

రాహుల్ సిప్లిగంజ్ ఎన్నికల బరిలోకి దిగనున్నారా. బిగ్‌ బాస్ విన్నర్‌గా, ఆస్కార్ స్టేజ్ ఫేమర్‌గా పేరొందిన రాహుల్ సిప్లిగంజ్ ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీకి సిద్దమైనట్లు తెలుస్తోంది. త్వరలో జరిగే తెలంగాణ ఎన్నికల బరిలో రాహుల్ పోటీ చేస్తారని చెబుతున్నారు. ఇందు కోసం ముందుగానే పార్టీతో పాటుగా నియోజకవర్గం ఖరారు చేసుకున్నట్లు సమాచారం. ఎన్నికల్లో పోటీ పైన అధికార ప్రకటనకు రాహుల్ సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ మంగళహాట్ ప్రాంతానికి చెందిన రాహుల్ సిప్లిగంజ్ రాజకీయంగా వార్తల్లో నిలుస్తున్నారు.…

National

జాతీయ రహదారి 65పై మల్కాపూర్ నుంచి విజయవాడ వరకు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేను ఏర్పాటు..?

భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు. జాతీయ రహదారి 65పై మల్కాపూర్ నుంచి విజయవాడ వరకు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేను ఏర్పాటు చేయాలని ప్రధానిని కోరారు. హైదరాబాద్ నుంచి విజయవాడ మధ్య ఉన్న జాతీయ రహదారి 65.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కలిపే అత్యంత రద్దీ రోడ్డు అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం జాతీయ రహదారి 65ను ఆరు లేన్లుగా మారుస్తున్నారని తెలిపారు. ఎల్బీనగర్…

National

కాంగ్రెస్ అభ్యర్థిని కూడా తానే నిర్ణయిస్తానంటూ మంత్రి మల్లారెడ్డి

హైదరాబాద్: ఎప్పుడూ ఏదో ఒక ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో ఉండే మంత్రి మల్లారెడ్డి.. తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్ సహా మంత్రులు, ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చారు. సమావేశాల అనంతరం అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి. మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరుండాలో తానే నిర్ణయిస్తానంటూ మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.…

TELANGANA

తెలంగాణ కాంగ్రెస్‌లో ఎన్నికల జోరు- టికెట్ల `స్టీరింగ్`వారి చేతుల్లో..!!

హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల గడువు దగ్గరపడుతోంది. అక్టోబర్/నవంబర్‌లల్లో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. డిసెంబర్ నాటికి కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావొచ్చు. ఈ ఎన్నికలను ఎదుర్కొనడానికి అన్ని పార్టీలు కసరత్తు సాగిస్తోన్నాయి. అధికార భారత్ రాష్ట్ర సమితి, కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ.. సర్వశక్తులను ఒడ్డుతున్నాయి. తెలంగాణతో పాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరంలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఈ రెండు రాష్ట్రాల్లో అధికారాన్ని నిలుపుకోవడంతో పాటు మిగిలిన…