సౌదీ ప్రమాద మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం, అక్కడే అంత్యక్రియలు: తెలంగాణ ప్రభుత్వం
సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన హైదరాబాద్ నగరానికి చెందిన 45 మంది యాత్రికుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం పరిహారాన్ని ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మృతుల ఒక్కొక్క కుటుంబానికి ఐదు లక్షల రూపాయల పరిహారాన్ని అందచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారంతా హైదరాబాద్ నగరానికి చెందినవారే కావడంతో, బాధిత కుటుంబాలకు తక్షణ సహాయం అందించేందుకు మంత్రివర్గం ఈ…

