News

National

ఢిల్లీ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకు బయల్దేరిన విమానం రష్యాకు మళ్లింపు: ఎందుకంటే?

న్యూఢిల్లీ: ఢిల్లీ నుంచి అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోకు బయల్దేరిన ఓ ఎయిర్ ఇండియా విమానం ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఆ విమానాన్ని అత్యవసరంగా రష్యాకు మళ్లించారు. చివరకు ఎయిర్ ఇండియా విమానం AI173 అక్కడ సురక్షితంగా ల్యాండ్ కావడంతో ప్రయాణికులు, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ విషయాన్ని ఎయిరిండియా అధికారులు తెలిపారు. ఢిల్లీ నుంచి శాన్‌ప్రాన్సిస్కోకు బయల్దేరిన ఎయిరిండియా విమానం AI173 ఓ ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తినట్లు గుర్తించారు. ఈ క్రమంలో వెంటనే విమానాన్ని రష్యా…

TELANGANA

రహస్య ఒప్పందాలపై బిజెపి నోరు విప్పాలి: షర్మిల

హైదరాబాద్: రహస్య రాజకీయ ఒప్పందాలు ఎ పార్టీతో కుదుర్చుకున్నదో బిజెపి ప్రజలకు నోరు విప్పి చెప్పాలని వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల డిమాండ్ చేశారు. ఇంతకు మీరు నడిపే రహస్య దోస్తానా.. ప్రీ పోల్ ఒప్పందమా.. పోస్ట్ పోల్ ఒప్పందమా.. అని ప్రశ్నించారు.రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీకి మద్దతు తెలపడమే బిజెపి రహస్య ఒప్పందమా అని ప్రశ్నించారు. తక్షణం బిజెపి నోరు విప్పాలని వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తోందని షర్మిల ఈ మేరకు ఒక…

National

పర్యావరణం కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచాలి

కూసుమంచి: పర్యావరణాన్ని కాపాడడానికి అందరూ మొక్కలను నాటి వాటిని సంరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి అన్నారు. సోమవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కూసుమంచి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఆవరణలో ఎమ్మెల్యే కందాళ మొక్కను నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మండల పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలల్లో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు. అనంతరం పాలేరు గ్రామంలోని బివి.రెడ్డి పంక్షన్ హాల్లో తెలంగాణ రాష్ట్ర అవతరణ…

National

సింగరేణి సంస్థను కాపాడుతున్న గొప్ప నాయకుడు కెసిఆర్

సత్తుపల్లి : తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సింగరేణి సంబరాలు జరుపుకుంటున్న సింగరేణి బొగ్గు గని కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య శుభాకాంక్షలు తెలియజేశారు. సోమవారం జెవి.ఆర్ కళాశాల ఆవరణలో జరిగిన వేడుకల్లో జిల్లా కలెక్టరు గౌతమ్, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రాష్ట్రం ఆవిర్భవించి తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని పదో సంవత్సరంలో అడుగు పెడుతున్న సంధర్భముగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2 నుంచి జూన్…

TELANGANA

వాతావరణ సమస్యను లేవనెత్తుతున్నాం : ప్రధాని మోడీ

న్యూఢిల్లీ : అభివృద్ధి చెందిన కొన్ని దేశాలు అనుసరిస్తున్న తప్పుడు విధానాల వల్ల పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలు మూల్యం చెల్లించుకోవలసి వస్తోందని, అందువల్ల ఆయా పెద్ద దేశాల ముందు వాతావరణ న్యాయ సమస్యను భారత్ గట్టిగా లేవనెత్తుతోందని ప్రధాని నరేంద్రమోడీ వెల్లడించారు. ప్రపంచ వాతావరణ దినం సందర్భంగా వీడియో సందేశాన్ని ఆయన సోమవారం వినిపించారు. ప్రపంచ వాతావరణ పరిరక్షణ కోసం అన్ని దేశాలూ తమ స్వార్థపర ప్రయోజనాలకు అతీతంగా ఆలోచించడం ముఖ్యమని పేర్కొన్నారు. అగ్రదేశాలు, అభివృద్ధి…

TELANGANA

తప్పిన పెను ప్రమాదం

పెనుబల్లి : పెనుబల్లి మండల కేంద్రంలో స్థానిక హెచ్‌పి గోడౌన్ సమీపంలో సోమవారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించగా సమీపంలోని తాటి చెట్లు, వరి గడ్డి వాములు తగలబడ్డాయి. దీంతో అప్రమత్తమైన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం తెలియజేశారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపు స్థానికులు మోటార్ల సహాయంతో అగ్ని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. అత్యంత సమీపంలోనే హెచ్‌పి గోడౌన్ ఉండటంతో గోడౌన్‌లో గ్యాస్ సిలిండర్లు నిల్వ ఉండటంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. సుమారు రెండు…

TELANGANA

అడవుల విస్తీర్ణంలో రాష్ట్రం మొదటి స్థానం: ఇంద్రకరణ్‌రెడ్డి

రాష్ట్రం అడవుల విస్తీర్ణంలో దేశంలో మొదటి స్థానంలో ఉందని, మున్సిపల్ వ్యర్థాల శుద్దిలో అగ్రస్థానంలో ఉందని అటవీ పర్యావరణ, సైన్సు, టెక్నాలజీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం సనత్‌నగరలోని కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రోజులకు 1082 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయని, వీటిలో 747 టన్నులు ప్రత్యామ్నాయ ఇంధనంగా ఉపయోగ పడుతున్నాయన్నారు. 345 టన్నుల చెత్తను మున్సిపల్ వ్యవస్థ సమర్దవంతంగా నిర్వహించాలని సూచించారు. అనంతరం…

National

ఆడి కారులో వచ్చి ఫుట్‌పాత్‌పై చాయ్‌ బిజినెస్ …

పెద్దగా చదువుకోని వాళ్లు, పెట్టుబడి పెట్టి వ్యాపారం చేయలేని వాళ్లు మాత్రమే ఫుట్‌పాత్‌(Footpath)పై చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకొని జీవనోపాధి పొందుతుంటారు. కాని ముంబై(Mumbai)లో ఇద్దరు యువకులు బాగా చదువుకున్నారు. ఒకరు ఎంబీఏ(MBA), మరొకరు బీటెక్(B.Tech) చేశారు. ఇంత చదివిన వాళ్లకు ఉద్యోగం కంటే ప్రత్యామ్నాయం ఏదైనా ఉందా అని ఆలోచించారు. అంతే ఆన్‌ డ్రైవ్ టీ(On Drive Tea) పేరుతో కొత్తగా స్టార్టప్ బిజినెస్‌(Startup business)ని ప్రారంభించారు. వీళ్ల వ్యాపారం ఏమిటంటే ఫుట్‌పాత్‌(రోడ్డు పక్కన) టీ…

National

రిజర్వ్ బ్యాంక్ లో ఉద్యోగాలు.. డిగ్రీ అర్హత..

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న పలు ఆర్‌బీఐ శాఖల్లో లీగల్‌ ఆఫీసర్‌, మేనేజర్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌, లైబ్రరీ ప్రొఫెషనల్‌ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానించింది. అభ్యర్థులు బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌ను rbi.org.in సందర్శించడం ద్వారా నిర్ణీత ఫార్మాట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్ట్‌ల గురించిన వివరాలను RBI అధికారిక వెబ్‌సైట్ నుండి కూడా చూడవచ్చు. దరఖాస్తులు…

CINEMA

కూతుర్ని హీరోయిన్‌ చేయాలని హార్మోన్ ఇంజెక్షన్స్ ఇచ్చి టార్చర్.. పాపం బాలిక..

కన్న కూతురి పట్ల ఓ తల్లి అత్యంత పాశవికంగా వ్యవహరించింది. కూతురుని హీరోయిన్ చేయాలనే పిచ్చిలో నరకం చూపింది. మాయగాళ్ల మాటలు విని అభం శుభం తెలియని బాలికకు ఇంజెక్షన్లు ఇచ్చి శరీరాన్ని కుళ్ల బొడిచింది. మాట వినకపోతే చిత్రహింసలు పెట్టి వేధించింది. ఆ బాధ భరించలేక బాలిక చైల్డ్ లైన్ అధికారులను ఆశ్రయించడంతో ఎట్టకేలకూ తల్లి చెర నుండి బయటపడింది. ఈ వ్యవహారం సంచలనంగా మారింది. విజయనగరం తోటపాలెంలో నివాసం ఉండే మహిళకు కుమార్తె పుట్టిన…