తెలంగాణలో మూడు రోజులపాటు వర్షాలు: ఎండలు కూడా తీవ్రమే, వడగాలుల అలర్ట్
హైదరాబాద్: తెలంగాణలో రానున్న మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో కొనసాగుతున్న ఆవర్తనం ఇవాళ దక్షిణ ఛత్తీస్‌గఢ్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతూ సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో స్థిరంగా ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ ద్రోణి విదర్భ నుంచి తెలంగాణ మీదుగా ఉత్తర ఇంటీరియన్ కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతున్నట్లు తెలిపింది. రాగల మూడు రోజులపాటు తెలంగాణలో అక్కడక్కడా తేలికపాటి…

