News

TELANGANA

ఎల్బీనగర్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదం

ఎల్బీనగర్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదం ఓ కుటుంబంలో తీరని విషాదం నింపింది. కారు డ్రైవర్ నిర్లక్ష్యంతో రెండేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఆమె తల్లిదండ్రులకు గాయాలయ్యాయి. గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఎన్టీఆర్ నగర్‌లో నివసించే సయ్యద్ హబీబుద్దీన్, శశిరేఖ దంపతులకు రేఖ అనే రెండేళ్ల చిన్నారి ఉంది. శశిరేఖ బ్యూటీషియన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా సేవలందించేందుకు మన్సూరాబాద్‌కు వచ్చారు.…

TELANGANA

తిరుమల ఘాట్ రోడ్లలో ప్రమాదాల నివారణ

తిరుమల/తిరుపతి: పవిత్ర పుణ్యక్షేత్రం అయిన తిరుమలకు ప్రతిరోజు వేలాది మంది భక్తులు వెళ్లి వస్తుంటారు. ఆర్ టీసీ బస్సులు. సొంత కార్లలో తిరుమలకు వెళ్లి వస్తుంటారు. వేలాది మంది భక్తులు అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు వెళ్లి వస్తుంటారు. తిరుమలకు వెళ్లే ప్రయాణికులు వాహనాల్లో సంచరించడానికి రెండు ఘాట్ రోడ్ లు ఉన్నాయి. తిరుమల ఘాట్ రోడ్లలో ప్రమాదాల నివారణకు దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్దం చెయ్యాలని సంబంధిత అధికారులకు టీటీడీ ఈవో ఏవీ. ధర్మారెడ్డి ఆదేశాలు జారీ…

TELANGANA

తెలంగాణ.. రాష్ట్రవ్యాప్తంగా దశాబ్ది సంబరాలు

9 సంవత్సరాలు పూర్తిచేసుకొని పదో ఏట అడుగుపెట్టిన తెలంగాణ.. రాష్ట్రవ్యాప్తంగా దశాబ్ది సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను ప్రభుత్వం వైభవంగా నిర్వహిస్తోంది. రోజుకో రంగం చొప్పున 21 రోజులపాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. తెలంగాణ అభివృద్ధికి ప్రతీకగా ఇవి నిలవనున్నాయని ప్రభుత్వం ప్రకటించింది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఫ్రాన్స్ శుభవార్త వినిపించింది. దేశంలోని చైతన్యవంతమైన రాష్ట్రమైన తెలంగాణలో ‘బ్యూరో డి ఫ్రాన్స్‌’ను త్వరలోనే ప్రారంభిస్తున్నట్లు భారత్‌లో ఫ్రాన్స్ రాయబారి ఎమ్మాన్యుయేల్ లెనేన్ ప్రకటించారు.…

TELANGANA

తెలంగాణతోపాటే, ఆంధ్రప్రదేశ్‌లో కూడా ముందస్తు ఎన్నికలు

తెలంగాణతోపాటే, ఆంధ్రప్రదేశ్‌లో కూడా ముందస్తు ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారం జరుగుతోంది. దీన్ని అటు అధికార పార్టీ నాయకులు కూడా ఖండించడం లేదు. ముందస్తు ఎన్నికలకు వెళితే వైసీపీ పార్టీకి లాభమా? నష్టమా అన్న ప్రశ్నలకు లాభమే ఎక్కువనే సమాధానాలు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా బిజేపీ వ్యతిరేక ఓట్ల శాతం పెరుగుతోంది. తాజాగా కర్ణాటక అసెంబ్లీ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఈ అభిప్రాయాన్ని మరింత బలపరుస్తోంది. ఏపీలో వైసీపీ- బిజేపీ ఒక్కటే అనే భావన వచ్చేందుకు ప్రతిపక్ష తెలుగుదేశం…

National

ఢిల్లీలో తెలంగాణ భవన్‌లో యువతి ఆత్మహత్యాయత్నం

న్యూఢిల్లీ: తెలంగాణ భవన్ ప్రాంగణంలో మంచిర్యాలకు చెందిన ఆరిజిన్ డెయిర్ సీఈవో బోడపాటి శేజల్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే స్పందించిన తెలంగాణ భవన్ సిబ్బంది ఆమెను ఆర్ఎంఎల్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి కొంత నిలకడగా ఉన్నట్లు తెలిసింది. శేజల్ గత కొంతకాలంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. మానసికంగా, లైంగికంగా ఎమ్మెల్యే చిన్నయ్య వేధిస్తున్నాడని ఆరోపించింది.రెండ్రోజుల…

APNationalTELANGANA

టీడీపీ ఆధ్వర్యంలో తెలంగాణా ఆవిర్భావ వేడుకలు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భవన్లో ఘనంగా ప్రారంభించారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు. తెలంగాణ ఆవిర్భావం ఒక చరిత్రని కాసాని జ్ఞానేశ్వర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర కల సాకారం అవ్వడానికి అసెంబ్లీ నుంచి మొట్టమొదటి ప్రతిపాదనలు ఇచ్చింది చంద్రబాబునాయుడు అని కాసాని జ్ఞానేశ్వర్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు, యువత కలలుగన్న తెలంగాణ రాలేదని, నీళ్లు, నిధులు, నియామకాల…

National

ఆర్గానిక్ ఫుడ్స్‌పై ప్రజలకు పెరుగుతున్న ఆసక్తి.. భవిష్యత్తులో ఫుడ్ క్లీనింగ్ ఇండస్ట్రీదే హవా..!

భారతీయుల ఆహారపు అలవాట్లను కరోనా పూర్తిగా మార్చేసింది. కరోనాకు ముందు చిరుతిళ్లు, జంక్‌ఫుడ్‌పై మక్కువ చూపిన వారు ఇప్పుడు సహజంగా పండించిన ఆహార పదార్థాలను తినడానికి ఇష్టపడుతున్నారు. దేశంలో ‘క్లీన్ ఫుడ్'(పరిశుభ్రమైన ఆహారం)పై ప్రజలకు అవగాహన పెరిగిపోయింది. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే స్వచ్ఛమైన ఆహారం తీసుకోవాల్సిందేనని నిశ్చయానికి వస్తున్నారు. ఇలాంటి వారి సంఖ్య దేశంలో క్రమంగా పెరుగుతోంది. ఫలితంగా రానున్న కాలంలో క్లీన్ ఫుడ్ ఇండస్ట్రీ(Clean food industry) ఓ వెలుగు వెలగనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.…

CINEMA

మొదలైన రామ్ గోపాల్ వర్మ వ్యూహం.. వైఎస్ జగన్‌గా నటించేది ఎవరంటే..

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఎపుడు ఎలా బిహేవ్ చేస్తాడో చెప్పడం కష్టం. మనసులో ఏది ఉందో దాన్ని నిర్మోహమాటంగా మాట్లాడం దాన్ని చేసేయడం ఆర్జీవి మార్క్ స్టైల్. గత కొన్నేళ్లు రామ్ గోపాల్ వర్మ తన చేతలతో వివాదాస్పద వ్యక్తిగా ముద్ర వేయించుకున్నారు. వర్మ ఏం చేసినా.. సంచలనమే. ఏమి చేయకుండా కామ్‌గా ఉన్నా కూడా ఏదో సంచలనానికి తెరలేపుతున్నట్టే అర్ధం.తన మనసుల ఏముందో నిర్మొహమాటంగా చెప్పడం వర్మను చూసే నేర్చుకోవాలి.…

National

తిరుపతిలో అపశృతి.. గోవిందరాజస్వామి ఆలయం ముందు ప్రమాదం.. ఒకరి మృతి

తిరుపతిలో(Tirupati) ఊహించని అపశృతి చోటు చేసుకుంది. తిరుపతిలోని గోవిందరాజస్వామి (Govindaraja Swamy Temple) ఆలయం ముందు ఉన్న పెద్ద మర్రి చెట్టు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే చనిపోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. వందల ఏళ్ల నాటి మర్రి చెట్టు కూలిపోవడంతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. ఇది ఊహించని ప్రమాదం కావడంతో ప్రాణనష్టం సంభవించినట్టు తెలుస్తోంది.…

CINEMA

త్వరలోనే పెళ్లి చేసుకోనున్న జబర్ధస్త్ కెవ్వు కార్తీక్.. అమ్మాయి ఎవరంటే..

జబర్దస్త్‌ ద్వారా పాపులరైన కమెడియన్‌ కెవ్వు కార్తీక్‌(Kevvu Karthik) త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. మన జీవితంలోకి కొత్త వ్యక్తి వస్తే లైఫ్‌ మరింత హ్యాపీగా మారుతుందని కొందరు చెప్పారని…బహుశా అది ఇదేనేమో అంటూ రాసుకొచ్చాడు. నా జీవితంలోకి అడుగుపెడుతున్నందుకు థ్యాంక్యూ అని.. నీతో కొత్త జీవితాన్ని ఆరంభించేందుకు ఎంతగానో ఎదురుచూస్తున్నాను అని పేర్కొన్నాడు. తను పెళ్లి చేసుకోబోయే అమ్మాయితో కలిసి దిగిన ఫోటోలను షేర్‌ చేశాడు…