News

TELANGANA

జూబ్లీహిల్స్‌లో పోరు ప్రారంభమైంది… నిజం, ధర్మం మన వైపు ఉంది: కేటీఆర్..

జూబ్లీహిల్స్‌లో పోరు మొదలైందని, ప్రజలంతా బీఆర్ఎస్ వెంటే ఉన్నారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. నిజం, ధర్మం కూడా బీఆర్ఎస్ పక్షానే ఉన్నాయని ఆయన అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహమత్‌నగర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో కేటీఆర్ ప్రసంగిస్తూ, కాంగ్రెస్ పార్టీ గురించి, రేవంత్ రెడ్డి గురించి హైదరాబాద్ నగర ప్రజలకు బాగా తెలుసని, అందుకే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కలేదని అన్నారు. అన్ని స్థానాల్లో బీఆర్ఎస్…

TELANGANA

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక… మొదటి రోజు ఎంత మంది నామినేషన్ వేశారంటే..!

జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ఉత్సాహంగా మొదలైంది. తొలి రోజే పది మంది అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. అయితే, ఆసక్తికరంగా ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులెవరూ మొదటి రోజు తమ నామినేషన్లను సమర్పించకపోవడం గమనార్హం.   తొలిరోజు బరిలోకి దిగిన 10 మందిలో ఇద్దరు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నుంచి ఉండగా, మిగిలినవారు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. తెలంగాణ పునర్నిర్మాణ సమితి…

AP

ఢిల్లీలో ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..! వాటిపై చర్చ..!

ఆంధ్రప్రదేశ్‌కు భారీ పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటన చేపట్టారు. ఈ క్రమంలో నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. ముఖ్యంగా, టెక్ దిగ్గజం గూగుల్ విశాఖపట్నంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత డేటా సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిందని, ఇందుకుగాను రూ. 86,000 కోట్లకు పైగా భారీ పెట్టుబడి పెట్టనుందని ప్రధానికి వివరించారు.   ఈ చారిత్రాత్మక పెట్టుబడికి సంబంధించి మంగళవారం ఢిల్లీలోనే గూగుల్ ప్రతినిధులతో…

AP

విశాఖలో గూగుల్ ఏఐ హబ్… రేపు ఢిల్లీలో చారిత్రాత్మక ఒప్పందం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక, సాంకేతిక రంగాల భవిష్యత్తును మార్చే దిశగా ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. టెక్నాలజీ దిగ్గజం గూగుల్, విశాఖపట్నంలో సుమారు 10 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.87,250 కోట్లు) భారీ పెట్టుబడితో ‘గూగుల్ ఏఐ హబ్’ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. దేశంలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలో ఒకటిగా నిలవబోతున్న ఈ మెగా ప్రాజెక్టుకు సంబంధించి మంగళవారం న్యూఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం, గూగుల్ సంస్థ ప్రతినిధుల మధ్య కీలక అవగాహన ఒప్పందం (ఎంఓయూ)…

National

జైళ్లలోని ఖైదీలకు ఓటు హక్కుపై సుప్రీంకోర్టులో విచారణ… కేంద్రానికి, ఈసీకి నోటీసులు..

దేశవ్యాప్తంగా జైళ్లలో ఉన్న విచారణ ఖైదీలు, శిక్ష ఖరారు కాని సుమారు 4.5 లక్షల మందికి ఓటు హక్కును నిరాకరించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్)పై విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ అంశంపై స్పందన తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వం, భారత ఎన్నికల సంఘానికి (ఈసీఐ) శుక్రవారం నోటీసులు జారీ చేసింది.   ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. గవాయ్, జస్టిస్ కె. వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. ప్రముఖ…

TELANGANA

ప్రభుత్వ వెల్ఫేర్ సొసైటీలకు.. రేవంత్ సర్కార్ స్పెషల్ ఫండ్..

ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజీలపై సీఎం రేవంత్ దృష్టి సారించారు. సమస్యల సత్వర పరిష్కారానికి సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. సమస్యల కోసం ప్రభుత్వంపై ఆధారపడకుండా, వెల్పేర్ సొసైటీలకు రూ.60 కోట్ల ఎమెర్జెన్సీ ఫండ్ ను విడుదల చేశారు. ఎస్సీ, బీసీ సొసైటీలకు రూ.10 కోట్లు చొప్పున నిధులను కేటాయించారు. ఈ నిధులను వినియోగించే అధికారులను సొసైటీ సెక్రటరీలకు కల్పించారు. సొసైటీల స్థాయిలోనే ప్రభుత్వ హాస్టల్స్ లో సమస్యలకు పరిష్కారం చూపనుంది.   ఫిజికల్…

TELANGANA

రేపు కోయంబత్తూరుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్….

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేపు కోయంబత్తూరు పర్యటనకు వెళ్లనున్నారు. దేశవ్యాప్తంగా వివిధ ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులు పాల్గొనే ప్రతిష్ఠాత్మకమైన 10వ ఎఫ్‌ఎంఏఈ-నేషనల్ స్టూడెంట్ మోటార్ స్పోర్ట్స్ కాంపిటీషన్-2025 ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమం కోయంబత్తూరులోని కుమారగురు ఇన్‌స్టిట్యూషన్స్‌లో జరగనుంది.   ఈ విషయాన్ని బీఆర్ఎస్ తన అధికారిక సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ విద్యార్థులు తమ సాంకేతిక ప్రతిభను ప్రదర్శించే ఈ జాతీయ పోటీలకు కేటీఆర్…

AP

కేబినెట్‌లో కీలక నిర్ణయం.. రూ.1,14,824 కోట్ల పెట్టుబడులకు ఆమోదం..

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రివర్గం అజెండా అంశాల తర్వాత మంత్రులతో వివిధ అంశాలపై సీఎం చంద్రబాబు చర్చించారు. ముంబై తరహాలో విశాఖ అభివృద్ధి చెందుతోందని.. గూగుల్, టీసీఎస్ వంటి దిగ్గజ కంపెనీల సంస్థల రాకతో.. ఐటీ హబ్‌గా ఏపీ మారబోతోందని అన్నారు సీఎం చంద్రబాబు. ఇక పెట్టుబడులకు ఆమోదంతో పాటు సంస్థల నెలకొల్పేలా మంత్రులు బాధ్యతలు తీసుకోవాలని సూచించారు చంద్రబాబు. ఎంతో కష్టపడి రాష్ట్రానికి పెద్ద ఎత్తున కూటమి సర్కార్ పెట్టుబడులు తెస్తోందని సీఎం…

AP

AI సాయంతో చంద్రబాబు, దేవినేని పేర్లు చెప్పి డబ్బులు వసూలు..

ఏఐ వచ్చిన తర్వాత ఏది నిజమో.. ఏది ఆర్టిఫిషియలో తెలియడం లేదు. దీంతో చాలా మంది మోసపోతున్నారు. అలాంటిది ఏకంగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పేరుతో వీడియో కాల్స్ చేసి టీడీపీ నేతలను బురిడీ కొట్టించిన ఇన్సిడెంట్ కలకలం రేపింది. ఏఐని ఉపయోగించి…ఏపీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి దేవినేని ఉమా వీడియో కాల్ చేసినట్లుగ తెలంగాణ టీడీపీ నేతలను గర్తుతెలియని వ్యక్తి మోసం చేశారు.   తెలంగాణ టీడీపీ నేతలకు టోకరా గత…

National

భారత్‌కు వచ్చిన తాలిబన్ మంత్రి..!

ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఆ దేశ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ భారత్‌లో పర్యటిస్తున్నారు. వారం రోజుల పాటు సాగనున్న ఈ పర్యటన, ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి కీలకమైనప్పటికీ, భారత అధికారులకు ఇది ఒక కొత్త రకమైన దౌత్యపరమైన సవాలును విసిరింది. సమావేశాల సందర్భంగా ఏ దేశపు జెండాను ప్రదర్శించాలనే అంశం ఇప్పుడు పెద్ద చిక్కుముడిగా మారింది.   ఈ పర్యటనలో ఆయన భారత విదేశాంగ మంత్రి ఎస్.…