మాదాపూర్‌లో కుంగిన రోడ్డు: ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు
హైదరాబాద్‌లోని అత్యంత రద్దీ ప్రాంతమైన మాదాపూర్‌లో రోడ్డు కుంగిపోవడంతో సైబరాబాద్ పోలీసులు కీలక ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శిల్పారామం సమీపంలోని సైబర్ గేట్ వద్ద భూగర్భ మంజీరా నీటి పైప్‌లైన్ లీకేజీ కారణంగా ఈ ప్రమాదం జరిగింది. నిరంతరం నీరు లీక్ అవ్వడం వల్ల భూమి లోపల మట్టి పట్టు కోల్పోయి ఉపరితలం ఒక్కసారిగా కుంగిపోయింది. దీంతో ఐకియా (IKEA) నుంచి సైబర్ టవర్స్ మీదుగా జేఎన్టీయూ (JNTU) వెళ్లే మార్గంలో వాహనాల రాకపోకలపై పోలీసులు ఆంక్షలు…

