News

National

దేశంలో కొత్తగా 157 నర్సింగ్ కాలేజీల ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం

దేశంలో కొత్తగా 157 నర్సింగ్ కాలేజీల ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఉన్న విద్యాసంస్థలతో పాటు ఇవి పనిచేస్తాయిని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య తెలిపారు. ఈ ప్రాజెక్టుకు రూ. 1570 కోట్ల వ్యయంతో ఆమోదం లభించిందన్నారు. ఈ నర్సింగ్ కాలేజీల ఏర్పాటు వచ్చే 24 నెలల్లో పూర్తి చేస్తామని పేర్కొన్నారు. నాణ్యతతో కూడిన నర్సింగ్‌ విద్యను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు నైపుణ్యంతో కూడిన నర్సింగ్ సిబ్బంది సంఖ్యను పెంచాలని…

National

కేంద్ర మంత్రి ఫైర్, ట్రబుల్ షూటర్ మీద చర్యలు తీసుకోండి, ఎన్నికల్లో !

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల నాయకులు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. కేపీసీసీ అధ్యక్షుడు డీకే. శివకుమార్ సామాన్య ప్రజలనే కాకుండా మీడియాను కూడా బెదిరిస్తున్నారని. ఆయన దౌర్జన్యాలు ఎక్కువ అయ్యాయని కేంద్ర మంత్రి శోభా కరందాజ్లే ఆరోపించడం హాట్ టాపిక్ అయ్యింది. ర్యాపిడో బైక్ లో జాగ్రత్త, బైక్ మీద నుంచి దూకేసిన యువతి, ఎక్కడంటే అక్కడ చేతులు ? బెంగళూరులో మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి శోభా…

AP

ఏపీలో సీఎం వైఎస్ జగన్ ప్రయాణిస్తున్న ఛాపర్ కు పదే పదే సాంకేతిక సమస్యలు

ఏపీలో సీఎం వైఎస్ జగన్ ప్రయాణిస్తున్న ఛాపర్ కు పదే పదే సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే పలుమార్లు తాడేపల్లి నుంచి గన్నవరం వెళ్లి ఢిల్లీకి బయలుదేరి వెళ్లే సమయంలో సాంకేతిక సమస్యల కారణంగా ప్రయాణాలు ఆలస్యం కావడమో లేక రద్దు కావడమే జరిగాయి. ఇవాళ మరోసారి అనంతపురం జిల్లాలోని నార్పలలో జగనన్న వసతి దీవెన కార్యక్రమంలో పాల్గొని పుట్టపర్తికి బయలుదేరే సమయంలో మళ్లీ ఇలాంటి పరిస్ధితే తలెత్తింది. వైఎస్ జగన్ ఇవాళ తొలిసారి సీఎం హోదాలో…

AP

అడ్వెంచర్ మూవీని తలపించే రెస్క్యూ

మౌంట్ అన్నపూర్ణ. నేపాల్‌లో ఉంటుందీ పర్వతం. పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటుంది. ప్రపంచంలోని అతి ఎత్తయిన పర్వత శిఖరాల్లో ఇదీ ఒకటి. అతి ఎత్తయిన 10వ పర్వతంగా దీనికి గుర్తింపు ఉంది. సముద్ర మట్టానికి 8,091 మీటర్ల ఎత్తులో ఉంటుంది. దీన్ని అధిరోహించడం అంత సులువు కాదు. ఎప్పటికప్పుడు వాతావరణం మారిపోతుంటుంది. అలాంటి దుర్భేధ్య పర్వతాన్ని అధిరోహించడానికి వెళ్లిన భారతీయ పర్వతారోహకుడొకరు మంచుదిబ్బల్లో చిక్కుకుపోయారు. 48 గంటల పాటు అందులోనే గడిపారు. ఆక్సిజన్ అందని సంక్లిష్ట వాతావరణ…

TELANGANA

హైదరాబాద్ ప్రజలకు మరో వినూత్న సౌకర్యం.!

హైదరాబాద్: హైదరాబాద్ నగర వాసులకు మరో అద్బుత సౌకర్యం అందుబాటులోకి రానుంది. ఆకాశంలో నడిచే భావన కలిగేలా నిర్మించిన వంతెనను నగర వాసులకు అందుబాటులోకి తేనుంది నగర పాలక సంస్ధ. జంట నగరాలు, శివారు ప్రాంతాల అభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తున్న హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) త్వరలో ఇన్నర్ రింగ్ రోడ్డు ఉప్పల్ చౌరస్తా వద్ద పాదచారుల రక్షణ కోసం నలువైపుల రోడ్డు దాటేందుకు వీలుగా ఆకాశ వంతెన స్కైవాక్(బోర్డ్ వాక్)ను ప్రజానీకానికి…

National

కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఢిల్లీలోని తన అధికారిక బంగళాను శనివారం ఖాళీ

కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఢిల్లీలోని తన అధికారిక బంగళాను శనివారం ఖాళీ చేశారు. లోక్ సభ సభ్యత్వానికి అనర్హత (disqualification)వేటు పడిన కారణంగా ప్రభుత్వం ఆయనను అధికారిక బంగళాను ఖాళీ చేయమన్న విషయం తెలిసిందే. దాంతో, శనివారం ఆయన తుగ్లక్ రోడ్ లోని 12 నెంబర్ బంగళాను ఖాళీ చేశారు. Rahul Gandhi disqualification row: ఇంటిపేరుపై అనుచిత వ్యాఖ్యలు ప్రధాని మోదీ (PM Modi) ఇంటిపేరైన ‘మోదీ’పై అనుచిత వ్యాఖ్యలు…

National

36 గంటలు.. 8 నగరాలు.. 5300 కిమీలు- ప్రధాని సుడిగాలి పర్యటన

సోమవారం ఉదయం నుంచి 36 గంటల వ్యవధిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) 5300 కిలోమీటర్లు ప్రయాణించి, 7 నగరాల్లో ఎనిమిది కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.   సోమవారం ఉదయం ఢిల్లీ నుంచి బయల్దేరి 36 గంటల వ్యవధిలో ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) సెంట్రల్ ఇండియాలోని మధ్య ప్రదేశ్, దక్షిణాదిన ఉన్న కేరళ, కేంద్ర పాలిత ప్రాంతాలైన దాద్రా నగర్ హవేలీ, డయ్యూ, డామన్ లలో పర్యటిస్తారు. తిరిగి మంగళవారం సాయంత్రానికి ఢిల్లీ చేరుకుంటారు.…

NationalWorld

సెప్టెంబర్ లో జో బైడెన్ భారత పర్యటన

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఈ సంవత్సరం సెప్టెంబర్ లో భారత్ కు రానున్నారు. భారత్ లో సెప్టెంబర్ నెలలో జరిగే జీ 20 (G20) దేశాధినేతల సమావేశంలో ఆయన పాల్గొంటారు. జీ 20 అధ్యక్ష బాధ్యతలను భారత్ సమర్దవంతంగా నిర్వహిస్తోందని అమెరికా ప్రశంసించింది. Joe Biden to visit India: జీ 20 సదస్సు భారత్ జీ 20 అధ్యక్ష బాధ్యతలను నిర్వర్తిస్తోంది. అందులో భాగంగా ఈ సెప్టెంబర్ నెలలో భారత్ లో…

National

అమృత్​ పాల్​ భార్య కిరణ్​దీప్​ కౌర్​ను పోలీసులు అదుపులోకి తీసుకోవడం పెద్ద టర్నింగ్​ పాయింట్​

ఖలిస్థానీ మద్దతుదారుడు, మత ప్రబోధకుడు అమృత్​ పాల్ సింగ్​​.. పంజాబ్​ పోలీసుల ఎదుటు లొంగిపోయిన వ్యవహారం ఇప్పుడు వార్తలకెక్కింది. పంజాబ్​ మోగాలోని ఓ గురుద్వారాలో ఆదివారం ఉదయం జరిగిన ప్రార్థనల అనంతరం అమృత్​ పాల్​ లొంగిపోయాడు. తాను అక్కడ ఉన్న విషయాన్ని పోలీసులకు ఈ వారిస్​ పంజాబ్​ దే చీఫ్​.. శనివారం రాత్రి చెప్పినట్టు తెలుస్తోంది. ఫలితంగా అమృత్​ పాల్​ను పట్టుకునేందుకు పంజాబ్​ పోలీసులు చేపట్టిన దాదాపు 40 రోజుల ఆపరేషన్​కు ముగింపు పడింది! ఇన్ని రోజులుగా…

National

మరోసారి రసవత్తరంగా మహారాష్ట్ర రాజకీయాలు

మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి రసవత్తరంగా మారుతున్నాయి. ఈ తరుణంలో.. ముఖ్యమంత్రి ఏక్‍నాథ్ షిండే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం 15 నుంచి 20 రోజుల్లోగా కుప్పకూలుతుందని శివసేన (యూబీటీ – ఉద్ధవ్ వర్గం) కీలక నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay Raut) అన్నారు. షిండే సర్కార్‌కు మరణ శాసనం రానుందని జోస్యం చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు సంజయ్ అత్యంత సన్నిహితుడు. కొన్ని పిటిషిన్లపై సుప్రీం కోర్టు నుంచి తీర్పు రావాల్సి ఉండగా.. సంజయ్…