సంచలనం: బంగ్లాదేశ్ సెలక్టర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మహిళా క్రికెటర్ జహనారా ఆలం!
బంగ్లాదేశ్ మహిళల క్రికెట్ జట్టులో సంచలనం సృష్టించిన విషయం ఇది. ప్రముఖ ఫాస్ట్ బౌలర్ జహనారా ఆలం (Jahanara Alam) జాతీయ జట్టు మాజీ సెలక్టర్ మంజూరుల్ ఇస్లాం తనను లైంగిక వేధింపులకు గురి చేశాడని సంచలన ఆరోపణలు చేసింది. మానసిక ఆరోగ్య కారణాలతో ప్రస్తుతం ఆటకు దూరంగా ఉంటున్న ఆమె, తాను ఇన్నాళ్లుగా ఎదుర్కొన్న వేధింపుల గురించి ఒక యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బయటపెట్టింది. మహిళల వన్డే ప్రపంచ కప్ 2022 సమయంలో జట్టు…

