News

AP

విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ కుంభకోణం.!

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో పెద్ద ఎత్తున జరిగిన ఫెర్రో అలాయ్స్ (ఫెర్రోలాయ్స్) కుంభకోణం ఇప్పుడు తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ముడిసరుకు కొనుగోళ్లలో జరిగిన అక్రమాలు, నాణ్యతా లోపాల కారణంగా ప్లాంట్‌లో వరుసగా ప్రమాదాలు జరుగుతుండటంతో యాజమాన్యం ఎట్టకేలకు గట్టి చర్యలు తీసుకుంది. ఈ అవినీతి వ్యవహారానికి పాల్పడిన బాధ్యులను ఏకంగా 15 మంది అధికారులను సస్పెండ్ చేయడంతో పాటు, మరో 19 మందిని అంతర్గతంగా బదిలీ (ఇంటర్నల్ ట్రాన్స్‌ఫర్) చేయడం ప్లాంట్ వర్గాల్లో కలకలం రేపుతోంది.…

APUncategorized

చిన్నారి మిస్సింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. కీలక ఆధారమైన కుక్క మృతి..

కాకినాడ జిల్లా తుని మండలానికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు ఊహించని మలుపు తీసుకుంది. ఈ కేసులో కీలక ఆధారంగా ఉన్న పెంపుడు కుక్క.. అకస్మాత్తుగా మృతి చెందడం పలు అనుమానాలకు తావిస్తోంది. చిన్నారి కోసం గాలించే క్రమంలో పోలీసులు.. ఈ శునకానికి జీపీఎస్ ట్రాకర్ ను అమర్చారు. ఈ క్రమంలో 80 నిమిషాల వ్యవధిలో 8 కి.మీ మేర తిరిగిన ఈ కుక్క.. ఇంటికి తిరిగొచ్చి ఒక్కసారిగా కుప్పకూలింది.   అయితే శునకం శుక్రవారం…

National

మోదీ, ఔరంగజేబు ఒకే మట్టిలో పుట్టారు: సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు..

శివసేన (యూబీటీ) సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్ మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీని మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుతో పోల్చి వివాదానికి తెరలేపారు. ఔరంగజేబు, మోదీ ఇద్దరూ ఒకే గడ్డపై పుట్టారని వ్యాఖ్యానించారు.   శనివారం పుణెలో జరిగిన విలేకరుల సమావేశంలో సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. “ఔరంగజేబు ఏ మట్టిలో అయితే పుట్టాడో, మోదీ కూడా అదే మట్టిలో పుట్టారు. ఔరంగజేబు గుజరాత్‌లోని దాహోద్‌లో జన్మించారు కదా?” అని వ్యాఖ్యానించారు.…

National

మీనాక్షి నాటరాజన్‌కు ఎదురుదెబ్బ.. జోక్యానికి నిరాకరించిన సుప్రీంకోర్టు..

కాంగ్రెస్ సీనియర్ నేత మీనాక్షి నటరాజన్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రాజ్యసభ నామినేషన్‌ను తిరస్కరించారంటూ ఆమె దాఖలు పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టి వేసింది. నామినేషన్ తిరస్కరణలో తాము జోక్యం చేసుకోలేమని వెల్లడించింది.   మీనాక్షి నాటరాజన్‌కు ఎదురుదెబ్బ, పిటిషన్ తిరస్కరించిన సుప్రీంకోర్టు   రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్‌కు ఊరట లభించలేదు. సుప్రీంకోర్టులో కూడా ఆమె రిలీఫ్ దక్కలేదు. ఆమె దాఖలు చేసిన పిటిషన్ జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ అతుల్‌…

TELANGANA

‘సింగరేణిని కుంభకోణాల గనిగా మార్చారు’.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు..

137 ఏళ్ల చరిత్ర కలిగిన సింగరేణిని కుంభకోణాల గనిగా మార్చారని బీఆర్ఎస్ ముఖ్యనేత హరీశ్ రావు మండిపడ్డారు. భూపాలపల్లిలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సింగరేణి కార్మికుల సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు. గతంలో ఫిక్స్ డ్ డిపాజిట్లతో కలకల లాడిన సింగరేణి నేడు అప్పులు ఊబిలో కూరుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ తన రెండున్నరేండ్ల పాలనలో కార్మికుల బతుకులను ఆగం పట్టించిందని ధ్వజమెత్తారు.   కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో దేనిని వదలడం…

AP

విద్యుత్ చార్జీలపై కీలక ప్రకటన చేసిన ఏపీ మంత్రి గొట్టిపాటి..

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తీవ్రంగా దెబ్బతిన్న విద్యుత్ రంగాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం విజయవంతంగా పునరుద్ధరించిందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… జగన్ ప్రభుత్వం విద్యుత్ వ్యవస్థలో సృష్టించిన విధ్వంసాన్ని కేవలం రెండేళ్లలోనే సరిదిద్ది, పట్టాలెక్కించామని పేర్కొన్నారు.   గత రెండేళ్లలో విద్యుత్ ఛార్జీలను ఒక్క రూపాయి కూడా పెంచలేదని… రాబోయే మూడేళ్లలో కూడా…

AP

జగన్ పేరులో ‘జీ’ అంటే ‘జెన్ జీ’ కాదు.. గొడ్డలి.. విధ్వంసమే ఆయన ఎజెండా: మంత్రి లోకేశ్‌..

రాయలసీమను ‘రాయల్ సీమ’గా మార్చడమే తమ ప్రభుత్వ ధ్యేయమని, ఇందుకోసం రూ.లక్ష కోట్ల భారీ బడ్జెట్‌తో ‘మిషన్ రాయలసీమ’ ప్రాజెక్టును చేపట్టబోతున్నామని రాష్ట్ర ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్‌ ప్రకటించారు. ఈ ప్రాజెక్టు దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా తిరుపతిలో నిర్వహించిన విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో కలిసి లోకేశ్‌ పాల్గొన్నారు. ఈ…

TELANGANA

తెలంగాణలో ‘ఎస్ఐఆర్’… రాజకీయ పార్టీల సహకారం కోరిన సీఈఓ..

తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) 2026 కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీల సహకారాన్ని కోరుతూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) సి. సుదర్శన్ రెడ్డి శుక్రవారం సమావేశం నిర్వహించారు. అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటర్లుగా నమోదు చేయడమే కాకుండా, జాబితాలోని అవకతవకలను తొలగించి, అత్యంత పారదర్శకమైన ఓటర్ల జాబితాను రూపొందించడమే తమ లక్ష్యమని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.   హైదరాబాద్‌లోని బీఆర్‌కేఆర్ భవన్‌లో జరిగిన ఈ సమావేశంలో, జూన్…

AP

ఏపీ రాజధానిలో కీలక పరిణామం.. అమరావతిలో రూ.1235 కోట్లతో కేంద్రం భారీ ప్రాజెక్ట్..

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అభివృద్ధి పనుల దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ), అమరావతిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం భారీ నివాస సముదాయాల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు కోసం రూ.1,234.91 కోట్లను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్ట్ వ్యయాన్ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే బడ్జెటరీ మద్దతు ద్వారా భరించనుంది.   ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును…

TELANGANA

ఫ్యూచర్ సిటీకి తొలి అడుగు.. కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్..

తెలంగాణాను ప్రపంచ ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ ప్రాజెక్టు వాస్తవరూపం దాల్చుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టు రాష్ట్ర భవిష్యత్తు ముఖచిత్రాన్ని మార్చబోతోందని ధీమా వ్యక్తం చేశారు.   కేవలం 150 రోజుల రికార్డు సమయంలో ఫ్యూచర్ డెవలప్‌మెంట్ అథారిటీ కార్యాలయ భవనాన్ని పూర్తి…