గ్రేటర్ పరిధిలో కుక్కల నియంత్రణకు సిఫార్స్ చేసిన 26 అంశాలలో 25 అంశాలు అమలు చేయాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు..
గ్రేటర్ పరిధిలో కుక్కల నియంత్రణకు ఏర్పాటైన కమిటీ సభ్యులు సిఫార్స్ చేసిన 26 అంశాలలో 25 అంశాలు అమలు చేయాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో జోనల్ కమిషనర్లు, శానిటేషన్ అడిషనల్ కమిషనర్, హైలెవల్ కమిటీ సభ్యులతో కలిసి మేయర్ సమీక్షించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ… ఆర్థికపరమైన అంశాలను కౌన్సిల్ లో తీర్మానం చేసి ప్రభుత్వ ఆమోదం కు పంపించడం జరుగుతుందని, మిగతా అంశాలు వెంటనే…

