తెలంగాణ రాష్ట్రంలో ఎస్సై, కానిస్టేబుల్ స్థాయి పోస్టులకు తుది రాతపరీక్షలు..
తెలంగాణ రాష్ట్రంలో ఎస్సై, కానిస్టేబుల్ స్థాయి పోస్టులకు తుది రాతపరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా సాంకేతిక విభాగానికి సంబంధించి పోలీస్ రవాణా సంస్థలో డ్రైవర్, మెకానిక్, అగ్నిమాపక శాఖలో డ్రైవర్ ఆపరేటర్ కానిస్టేబుల్ అభ్యర్థులకు తుది రాత పరీక్షను హైదరాబాద్ కేంద్రంలో నిర్వహించున్నారు. ఏప్రిల్ 2వ తేదీన మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు పరీక్ష జరుగుతుందని తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) మంగళవారం (మార్చి 28) ప్రకటించింది.…

