భారత ఫార్మాకు ట్రంప్ షాక్.. మందులపై 100 శాతం సుంకాలు..!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ఫార్మా రంగానికి భారీ షాక్ ఇచ్చేలా సంచలన నిర్ణయం తీసుకున్నారు. బ్రాండెడ్, పేటెంట్ పొందిన ఔషధాల దిగుమతిపై 100 శాతం వరకు సుంకాలు విధిస్తున్నట్లు గురువారం ప్రకటించారు. ఈ కొత్త నిబంధనలు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. అయితే, అమెరికాలో తయారీ ప్లాంట్లను నిర్మిస్తున్న కంపెనీలకు ఈ సుంకాల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ నిర్ణయం భారత ఔషధ పరిశ్రమపై తీవ్ర ప్రభావం…

