మహిళలు తమ హక్కులను సాధించుకుంటూ సమానత్వం వైపు సాధికారత పొందడమే మహిళా దినోత్సవ లక్ష్యం సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డేగా ప్రభాకర్……
ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య (ఎన్.ఎఫ్.ఐ.డబ్ల్యూ)ఆధ్వర్యంలో స్ఫూర్తి భవన్ నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎన్.ఎఫ్.ఐ.డబ్ల్యూ ఏలూరు నగర సమితి ఆధ్వర్యంలో నగర కోశాధికారి మావూరి విజయ అధ్యక్షతన సదస్సు నిర్వహించారు. ముందుగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ న్యాయమూర్తి అడబాల లక్ష్మి మహిళా ఆంధ్ర ప్రదేశ్ మహిళా సమాఖ్య పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సదస్సులో ఆమె మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లోనూ సమాన అవకాశాలను సాధించుకునేందుకు తమ హక్కుల గురించి…

