నేతన్నల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్.. కల్వకుంట్ల కవిత విమర్శలు..!
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు చేనేత కార్మికుల జీవితాలను అంధకారంలోకి నెట్టేస్తున్నాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విద్యాశాఖ ద్వారా చేనేత కార్మికులకు అందాల్సిన యూనిఫాంల ఆర్డర్‌ను ఏకపక్షంగా రద్దు చేయడం దుర్మార్గమైన చర్య అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల వేలాది మంది నేతన్నల కుటుంబాలు వీధిన పడే పరిస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం…

