కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. లష్కరే కమాండర్ హతం..
జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత ప్రక్రియ కొనసాగుతోంది. శనివారం మధ్య కశ్మీర్‌లోని బుద్గాం జిల్లాలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) కమాండర్ యాసిర్ హతమయ్యాడు. యూస్‌మార్గ్ అటవీ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది.యూస్‌మార్గ్ ప్రాంతంలో ఉగ్రవాదుల సంచారంపై నిఘా వర్గాల నుంచి అందిన కచ్చితమైన సమాచారంతో స్పెషల్ ఫోర్సెస్, 53 రాష్ట్రీయ రైఫిల్స్ దళాలు సంయుక్తంగా ‘కార్డన్ అండ్ సెర్చ్’ ఆపరేషన్ ప్రారంభించాయి. భద్రతా బలగాల రాకను…

