హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న మహేష్ బాబు మేనకోడలు జాన్వీ స్వరూప్: అధికారికంగా ప్రకటించిన తల్లి మంజుల
సూపర్ స్టార్ కృష్ణ గారి కుటుంబం నుండి మూడవ తరం వారసురాలు సినీ రంగ ప్రవేశానికి సిద్ధమైంది. సూపర్ స్టార్ మహేష్ బాబు మేనకోడలు, నటి-నిర్మాత మంజుల మరియు స్వరూప్‌ల కుమార్తె అయిన జాన్వీ స్వరూప్ హీరోయిన్‌గా వెండితెరకు పరిచయం కానున్నారు. నేడు జాన్వీ పుట్టినరోజు సందర్భంగా, తల్లి మంజుల సోషల్ మీడియా వేదికగా తమ కుమార్తె సినీ రంగ ప్రవేశాన్ని అధికారికంగా ప్రకటించారు. మంజుల తన ఇన్‌స్టాగ్రామ్‌లో జాన్వీ ఫోటోలను పోస్ట్ చేస్తూ, “నా కూతురు…

