News

APPOLITICSTELANGANA

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును తెలంగాణకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును తెలంగాణకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఆ విషయంపై టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ట్వీట్ చేస్తూ సొంత బాబాయ్ కేసును ఇతర రాష్ట్రానికి వెళ్లడం సిగ్గచేటని అన్నారు. ఈ కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని మృతుడి కుమార్తె వైఎస్ సునీత దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. జస్టిస్ ఎంఆర్ షా నేతృత్వంలోని ధర్మాసనం తెలంగాణకు…

CINEMA

డీజే టిల్లు2 లో కొత్త హీరోయిన్…?

తెలుగు ప్రేక్షకులను ఎంతో అలరించిన డీజే టిల్లు (DJ Tillu) సినిమా కి సీక్వెల్ టిల్లు స్క్వేర్ (డిజే టిల్లు 2) (Tillu Square) రూపొందుతున్న విషయం తెలిసిందే. హీరో సిద్ధార్థ్ జొన్నలగడ్డ (Siddharth Jonnalagadda) ఈ సినిమా ను ఇటీవలే అనౌన్స్ చేశాడు. యూత్ ను ఈ సినిమా ఎంతో ఆకట్టుకోవడంతో ఈ సినిమా కి సీక్వెల్ చేయాలనే డిమాండ్ ఎక్కువగా నెలకొంది. అందుకే సిద్దు వెంటనే ఈ సినిమా కు సీక్వెల్ మొదలు పెట్టాడు.…

NationalWorld

అదానీ గ్రూప్ నిర్మిస్తున్న విజిన్‍జమ్ పోర్టు పై కేరళలో ఆందోళనలు

అదానీ గ్రూప్ నిర్మిస్తున్న విజిన్‍జమ్ పోర్టు(Vizhinjam Port) పై కేరళలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ ట్రాన్స్ షిప్‍మెంట్ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ కొందరు ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అదుపులోకి తీసుకున్న వారిని విడుదల చేయాలంటూ వేలాది మంది ప్రజలు.. కేరళలోని విజిన్‍జమ్ పోలీస్ స్టేషన్‍ (Vizhinjam Police Station) ను ముట్టడించారు. కేరళ రాజధాని తిరువనంతపురానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ స్టేషన్‍పై దాడి చేశారు. దీంతో…

APPOLITICSTELANGANA

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలపై దాడి

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలపై దాడి జరిగింది. నర్సంపేటలో వైఎస్ షర్మిల పాదయాత్ర జరుగుతుండగా, పాదయాత్రపై తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. ఇరు వర్గాల మధ్యా తోపులాట చోటు చేసుకుంది. పరస్పరం ఇరు వర్గాలూ దాడులు చేసుకున్నాయి. ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి లాఠీలు ఝులిపించాల్సి వచ్చింది. వైఎస్ షర్మిల పాదయాత్ర వెంట వచ్చిన, బస్సుని కూడా తగలబెట్టారు ఆందోళనకారులు. షర్మిల రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారంటూ.. పదే…

National

గుజరాత్ లో ఆప్ కార్యకర్తలకు, నిరసనకారులకు మధ్య ఘర్షణ వాతావరణం

గుజరాత్ లో అసెంబ్లీ ఎన్నికలకు కొన్నిరోజులు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు భారీ బహిరంగసభలు, రోడ్ షోలో నిర్వహిస్తూ ముఖ్యనేతలంతా బిజీగా ఉన్నారు. ఈ తరుణంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సూరత్ లో రోడ్డు షోలో పాల్గొన్నారు. కేజ్రీవాల్ కాన్వాయ్ పై రాళ్ల దాడి జరిగింది. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆయన్ను కారులోకి ఎక్కించారు. మీడియాపై కూడా దాడి…

POLITICS

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

ఎవరెన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన నా పాదయాత్ర ఆగదన్నారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ప్రజాసంగ్రామ యాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో…ఆడెపల్లి పోచమ్మ ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. తన 5వ విడత పాదయాత్ర ప్రారంభమైందని ప్రకటించారు సంజయ్. ఈ సందర్భంగా అధికారపార్టీపై తీవ్ర విమర్శలు చేశారాయన. భైంసాలో తిరగాలంటే వీసాలు తీసుకోని రావాలా అంటూ ప్రశ్నించారు. భైంసా నిషేధిత ప్రాంతమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ తిరిగేందుకు కూడా అనుమతి తీసుకోవాల…

AP

అమరావతి రైతులకు చుక్కెదురు

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రతిపాదనకు సుప్రీం కోర్టు పరోక్షంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును తప్పుబడుతూ దానిపై మధ్యంతర స్టే విధించింది. ఏకైక రాజధానిగా అమరావతిని మాత్రమే కొనసాగించాలంటూ దాఖలైన పిటీషన్లపై వాదోపవాదాలను ఆలకించిన సుప్రీం కోర్టు న్యాయమూర్తులు కీలక వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. అభివృద్ధిని ఒకేచోట కేంద్రీకరించడం సరైంది కాదని, ఏ రాష్ట్రమైనా సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే అధికారం, అభివృద్ధి వికేంద్రీకరణ అవసరమని వ్యాఖ్యానించడం జగన్మోహన్ రెడ్డి…

TELANGANA

అంబేద్కర్ చౌక్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు

అందరు గర్వించేలా, అందరు హర్షించేలా, ప్రతి మనిషికి భరోసా కల్పించేలా సామాన్య ప్రజల నుండి సంపన్నుల ప్రజల దాక అందరికి సమాన హక్కులను కలిపించే విధంగా భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ శ్రమించి 2 సంవత్సరాల 11నెలల 18రోజులు కాలాన్ని తీసుకొని భారతదేశం యొక్క విలువలను గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేస్తూ ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగాన్ని రూపొందించారు. ప్రతి సంవత్సరం నవంబర్ 26న దేశం మొత్తం రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటారు. ఈ రోజునే…

TELANGANA

voter card లో మార్పులు చేర్పులుల గురించి అన్ని గ్రామపంచాయతీ లో బూత్ లెవెల్ అధికారులు దరఖాస్తులు

4 న్యూస్ ప్రతినిధి మెదక్ జిల్లా : అల్లదుర్గ్ మండలంలోని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మండలంలోని అన్ని గ్రామాల 18 సంవత్సరలు నిండి ఉన్న ప్రతి ఒకరు ఓట్టర్ కార్డు మరియు ఓట్టర్ లో మార్పులు చేర్పులుల గురించి అన్ని గ్రామపంచాయతీ లో బూత్ లెవెల్ అధికారులు దరకాస్తలు స్వీకరిస్తున్నారు ఈ రోజు మరియు రేపు 27 ఉంటుందని అధికారులు తెలిపారు ఇట్టి కార్యక్రమాన్ని అల్లదుర్గ్ తాసిల్దార్ తులసి రామ్ గారు పరిశీలించారు

TELANGANA

ఆక్రమణ దారులపై చర్యలు తీసుకోవాలి సాగు భూములకు పట్టాలివ్వాలి

పార్వతీపురం మన్యం జిల్లా : గిరిజనల భూమిని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం(అయార్ల) జిల్లా కార్యదర్శి పి .సంఘం కోరారు. ఈ మేరకు శుక్రవారం పార్వతీపురం మండలం, పెదమరికి పంచాయితి , శివం దొరవలస, చినమరికి గ్రామాలకు చెందిన పలువురు గిరిజనులుతో ఆయన స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు . అనంతరం తహశీల్దార్ శివన్నారాయన కు వినతిపత్రం అందజేసి సమస్యను వివరించారు. పట్టణానికి చెందిన మాజీ…