ఏపీ లిక్కర్ స్కాం కేసు దర్యాప్తులో మరో కీలక పరిణామం..! ఎంపీ మిథున్ రెడ్డి ఇళ్లు, ఆఫీసులపై సిట్ దాడులు..
ఏపీ లిక్కర్ స్కాం కేసు దర్యాప్తులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి లక్ష్యంగా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దూకుడు పెంచింది. మంగళవారం ఉదయం హైదరాబాద్, తిరుపతి, బెంగళూరులోని ఆయన నివాసాలు, కార్యాలయాలపై నాలుగు సిట్ బృందాలు ఏకకాలంలో మెరుపు దాడులు నిర్వహించాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లోని నివాసంలో మిథున్ రెడ్డిని అధికారులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో (2019-2024) మద్యం విధానంలో…

